రెడ్ గౌన్‌లో రకుల్.. గ్లామర్‌తో కట్టిపడేస్తోందిగా..
అయితే ఈ సినిమా ఇంకా హోల్డ్ లోనే ఉంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం రకుల్ ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది.
By: M Prashanth | 24 Oct 2025 12:00 AM ISTటాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. నటనతోనే కాకుండా తన ఫిట్నెస్, యూనిక్ స్టైల్ స్టేట్మెంట్లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
లేటెస్ట్ ఫొటోషూట్‌లో రకుల్ స్ట్రాప్‌లెస్ రెడ్ గౌన్‌లో మెరిసిపోయింది. థై హై స్లిట్తో ఉన్న ఈ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తోంది. "ఈ అవుట్‌ఫిట్, ఈ సాంగ్‌తో ప్రేమలో పడిపోయా" అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్‌ను బట్టి ఈ లుక్‌ను ఎంతగా ఇష్టపడిందో అర్థమవుతోంది. ఆమె పోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో టాలీవుడ్లో బ్రేక్ అందుకున్న రకుల్, ఆ తర్వాత 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు' వంటి వరుస హిట్లర్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగులో టాప్ లీగ్‌లో ఉండగానే బాలీవుడ్‌పైనా దృష్టి సారించి, అక్కడ కూడా వరుస ఆఫర్లతో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది.
ప్రస్తుతం రకుల్ కెరీర్ సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతోంది. ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా, కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఇండియన్ 3' లో కూడా రకుల్ కీలక పాత్ర పోషిస్తోంది.
అయితే ఈ సినిమా ఇంకా హోల్డ్ లోనే ఉంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం రకుల్ ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోషూట్లు, ఫిట్నెస్ అప్డేట్లతో ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లో ఉంటూ తన క్రేజ్‌ను ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటోంది.
