వర్కౌట్లు, పిజ్జా ట్రీట్.. రకుల్ ప్రీత్ సింగ్ కొత్త స్టైల్ చూశారా?
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రేక్షకులను అందం, అభినయంతో మంత్రముగ్ధులను చేస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ సృష్టించారు.
By: Madhu Reddy | 23 Oct 2026 3:23 PM ISTటాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రేక్షకులను అందం, అభినయంతో మంత్రముగ్ధులను చేస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ సృష్టించారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఆసక్తికరమైన ఫోటోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తన దైనందిన జీవితంలోని హెల్దీ లైఫ్‌స్టైల్, జిమ్ వర్కౌట్లు, వెకేషన్ విశేషాలను అభిమానులతో పంచుకున్న రకుల్ లేటెస్ట్ అప్‌డేట్స్ ఇప్పుడు చూద్దాం..
హెల్దీ ఫుడ్.. 'మోస్ట్ ఆఫ్ ది టైమ్':
తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ లో బ్యాలెన్సెస్ లైఫ్‌స్టైల్‌ను ప్రమోట్ చేస్తూ పలు ఫోటోలను పంచుకున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రతిబింబించేలా ఒక హెల్దీ ఫుడ్ స్ప్రెడ్‌ను పోస్ట్ చేస్తూ.. "ఈటింగ్ హెల్త్య్ ... మోస్ట్ అఫ్ ది టైం " అనే క్యాప్షన్ జోడించారు. అలాగే మరో పిక్‌లో చీట్ మీల్‌గా పిజ్జా ముక్కను ఆస్వాదిస్తూ "ఎంజాయింగ్ ఏ లిటిల్ మీ -టైం " అంటూ సరదాగా గడుపుతున్న క్షణాలను పంచుకున్నారు.
జిమ్ వర్కౌట్స్‌తో మూడ్ లిఫ్టింగ్:
కేవలం ఫుడ్ మాత్రమే కాకుండా ఫిట్‌నెస్‌కు కూడా రకుల్ ఎంతో ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. గ్రే టాప్, బ్లూ అథ్లెటిక్ షార్ట్స్‌తో జిమ్ వేర్‌లో కనిపిస్తూ.. చేతిలో వెయిట్ ప్లేట్స్‌ను పట్టుకుని వర్కౌట్ చేస్తున్న ఫోటోను ఆమె షేర్ చేశారు. దానికి "లిఫ్టింగ్ వెయిట్స్ అండ్ లిఫ్టింగ్ మై మూడ్ " అంటూ పోస్ట్ చేసారు. ఈ ఫోటో ఫిట్‌నెస్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గ్రీస్ ట్రిప్.. బుక్స్ రీడింగ్‌తో ప్రశాంతత:
ఈ పోస్ట్‌లో రకుల్ తన వెకేషన్ మూమెంట్స్‌ను కూడా పంచుకున్నారు. గ్రీస్‌లోని ప్రఖ్యాత మైకోనోస్ లగ్జరీ రిసార్ట్ 'రాయల్ మైకోనియన్ రిసార్ట్'లో సముద్ర తీర అందాలను ఆస్వాదిస్తూ ఆమె సేదతీరారు. అంతేకాకుండా తన ట్రిప్‌లో పుస్తకాలు చదువుతూ కనిపించారు. "కొన్ని పుస్తకాలు కేవలం కథలను మాత్రమే చెప్పవు.. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి వచ్చి, మీరు వెళ్లే దారిలో తోడుగా నడుస్తాయి" అంటూ ఆమె రాసుకొచ్చిన లైన్స్ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
రామాయణ'లో శక్తివంతమైన 'శూర్పణఖ' పాత్ర:
ఇక సినిమాల విషయానికి వస్తే, రకుల్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా చిత్రం 'రామాయణ: పార్ట్ 1' లో ఆమె నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పౌరాణిక చిత్రంలో రకుల్ అత్యంత ప్రాధాన్యత కలిగిన 'శూర్పణఖ' పాత్రలో కనిపించనున్నారు. ఇక రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత మే నెలలో 'పతి పత్నీ ఔర్ వో దో' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న రకుల్, ఈ పౌరాణిక పాత్రతో ఎలాంటి అద్భుతం చేయబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక మొత్తానికి చూస్తే, అటు పర్సనల్ లైఫ్‌లో హెల్దీ లైఫ్‌స్టైల్‌ను మెయింటైన్ చేస్తూనే, ఇటు కెరీర్‌లో భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ట్రెండ్‌కు తగినట్టుగా తనను తాను మలచుకుంటున్నారు. అందం, అభినయం కలగలిసిన ఈ బ్యూటీ నవంబర్ 5న రాబోతున్న 'రామాయణ'తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.
