Begin typing your search above and press return to search.

స్లిప్ అయ్యాడనుకున్నారు కానీ తెలివిగా త‌ప్పించుకున్నాడు!

బాలీవుడ్ క‌పుల్స్ ర‌కుల్ ప్రీత్ సింగ్-జాకీ భ‌గ్నాని ప్రేమ‌వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇద్ద‌రి ధాంప్య జీవితం సంతోషంగా సాగిపోతుంది.

By:  Srikanth Kontham   |   24 April 2026 9:08 AM IST
స్లిప్ అయ్యాడనుకున్నారు కానీ తెలివిగా త‌ప్పించుకున్నాడు!
X

బాలీవుడ్ క‌పుల్స్ ర‌కుల్ ప్రీత్ సింగ్-జాకీ భ‌గ్నాని ప్రేమ‌వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇద్ద‌రి ధాంప్య జీవితం సంతోషంగా సాగిపోతుంది. న‌టిగా ర‌కుల్ బిజీగా ఉంటే? నిర్మాత‌గా జాకీ ప్ర‌యాణం సాపీగా సాగిపొతుంది. వివాహం త‌ర్వాత ఆర్దిక ఇబ్బందులు ఎదురైనా వాటిని దాటుకుని ప్ర‌యానాన్ని ముందుకు సాగిస్తున్నాడు. అయితే తాజాగా జాకీ భగ్నానీ వివాహ బంధాన్ని ఉద్దేశించి `సిట్యుయేషన్ షిప్` అనే పదాన్ని వాడటం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సాధారణంగా పెళ్లిని పవిత్రమైన బంధంగా, శాశ్వతమైన అనుబంధంగా భావిస్తారు. కానీ జాకీ ఇలాంటి భిన్నమైన పదాన్ని ఎందుకు వాడారనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తాజాగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ తన ఉద్దేశం ప్రతికూలమైనది కాదని స్పష్టం చేశాడు. `పెళ్లి అనేది ముగింపు పాయింట్ కాదని అది ప్రతిరోజూ మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా ఎదిగే ఒక ప్రక్రియ అని అభి ప్రాయపడ్డాడు. `సిట్యుయేషన్ షిప్` అంటే ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజూ కొత్త పరిస్థితులను కలిసి ఎదుర్కోవడం , ఒకరికొకరు తోడుగా ఉండటమేనని తనదైన శైలిలో నిర్వచించారు. ఈ విలక్షణమైన ఆలోచనా దృక్పథం ఆయన వ్యక్తిత్వాన్ని , వారి బంధం పట్ల ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా జాకీ వ్యాఖ్యలపై సరదాగా స్పందించింది.

వారిద్దరి మధ్య ఉన్న అవగాహన , స్నేహమే ఈ బంధాన్ని నిలబెడుతోందని పేర్కొంది. పెళ్లి తర్వాత కూడా భార్యాభర్తలుగా మాత్రమే కాకుండా మంచి స్నేహితులుగా ఉంటున్నామంది. అందుకే ఇలాంటి సరదా వ్యాఖ్యలను తాము ఎంజాయ్ చేస్తామని తెలిపింది. నేటి తరం యువత రిలేషన్‌షిప్స్ విషయంలో చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. జాకీ భగ్నానీ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కోవకే చెందుతాయి. పెళ్లిని బరువుగా, బాధ్యతగా మాత్రమే చూడకుండా నిరంతర ప్రయాణంగా భావించడం వల్ల బంధం మరింత గట్టిపడుతుందని జాకీ నమ్ముతున్నారు.

సాంప్రదాయ పద్ధతులకు ఆధునిక ఆలోచనలను జోడించి ఈ జంట ముందుకు సాగుతుండటం చూస్తుంటే? వారు వైవాహిక జీవితాన్ని ఎంత సృజనాత్మకంగా మలుచుకుంటున్నారో అర్థమవుతోంది. సినిమా రంగంలో ఉన్న సెలబ్రిటీల మధ్య ఇలాంటి సరదా సంభాషణలు ఒక్కోసారి వివాదాలకు దారితీస్తుంటాయి. కానీ జాకీ , రకుల్ విషయంలో వారు ఒకరినొకరు ఎంతగా గౌరవించుకుంటారో అందరికీ తెలిసిందే. అందుకే `సిట్యుయేషన్ షిప్` అనే పదం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని అభిమానులు కూడా పాజిటివ్‌గానే తీసుకుంటున్నారు.

ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో హుందాగా, సంతోషంగా గడుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాకీ భగ్నానీ - రకుల్ ప్రీత్ సింగ్ ల బంధం పేరుకో లేదా సామాజిక నిబంధనలకో పరిమితం కాలేదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం ,నిరంతరం ప్రేమను పంచుకోవడమే వారి అసలైన రహస్యం. జాకీ వాడిన ఆ పదం వారు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ తోడుగా ఉంటామనే ధైర్యాన్ని ఇస్తోంది. ఈ జంట వైవాహిక జీవితం ఇలాగే కలకాలం సంతోషంగా సాగాలని నెటి జ‌నులు కోరుకుంటున్నారు.