Begin typing your search above and press return to search.

స్టైలిష్ ఫోజులతో ఆకట్టుకుంటున్న రకుల్!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Madhu Reddy   |   7 Nov 2025 10:00 PM IST
స్టైలిష్ ఫోజులతో ఆకట్టుకుంటున్న రకుల్!
X

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్లో దేదే ప్యార్ దే 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్లో జోరుగా పాల్గొంటున్న ఈమె అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ పలు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వైట్ కలర్ లేటెస్ట్ ట్రెండీ అవుట్ ఫిట్ ధరించిన ఈమె అందులో స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని అభిమానులతో పంచుకుంది.




కుర్చీలో కూర్చొని స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె మరొకవైపు అందాలు ఆరబోస్తూ తన అందంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ దేదే ప్యార్ దే 2 మూవీ ప్రమోషన్స్ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




రకుల్ నటిస్తున్న దేదే ప్యార్ దే 2 మూవీ విషయానికి వస్తే.. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ 2019లో నటించిన దేదే ప్యార్ దే సినిమా సీక్వెల్ గా దేదే ప్యార్ దే 2 రాబోతోంది ఇటీవల ఈ ట్రైలర్ విడుదల అవ్వగా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాని టీ సిరీస్, లవ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. అన్షుల్ శర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ మాధవన్ ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కి తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. నవంబర్ 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం అటు రకుల్ కూడా గ్లామర్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.




ప్రముఖ తెలుగు చలనచిత్ర నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తమిళ్, కన్నడ , హిందీ భాషలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె ఒక పంజాబీ కుటుంబంలో జన్మించినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఈమెను ఓన్ చేసుకోవడంతో ఇక్కడే సినిమాలు చేస్తూ కొంతకాలం హైదరాబాదులో కూడా నివసించింది. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈమె.. అక్కడే ప్రముఖ నటుడు , నిర్మాత అయిన జాకీ భగ్నానీతో ఏడు అడుగులు వేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోందని చెప్పవచ్చు. మరి ఈసారైనా ఈ చిత్రంతో రకుల్ కి సక్సెస్ లభిస్తుందో లేదో చూడాలి.