Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో ఫుల్ జోష్.. ట్రెండీ లుక్​లో రకుల్ గ్లామర్ ట్రీట్!

టాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా వెలుగొంది, ఇప్పుడు బాలీవుడ్​లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్.

By:  M Prashanth   |   22 Nov 2025 10:39 PM IST
బాలీవుడ్ లో ఫుల్ జోష్.. ట్రెండీ లుక్​లో రకుల్ గ్లామర్ ట్రీట్!
X

టాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా వెలుగొంది, ఇప్పుడు బాలీవుడ్​లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఫిట్​నెస్​కు కేరాఫ్ అడ్రస్​గా నిలిచే ఈ బ్యూటీ, తన నటనతోనే కాకుండా స్టైలిష్ లుక్స్​తోనూ ఫ్యాన్స్​ను ఎప్పుడూ ఆకట్టుకుంటారు. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.




ఈ లేటెస్ట్ ఫొటోషూట్​లో రకుల్ ఎంతో ట్రెండీగా కనిపిస్తున్నారు. నలుపు, తెలుపు చారలు ఉన్న స్టైలిష్ క్రాప్ టాప్, దానికి మ్యాచింగ్​గా వైట్ షార్ట్స్ ధరించి గ్లామరస్​గా మెరిసిపోతున్నారు. ఆమె ఫిట్​నెస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సింపుల్​గా కనిపిస్తూనే, ఎంతో గ్లామరస్ గా ఉన్న ఈ లుక్​కు అభిమానుల నుంచి లైకుల వర్షం కురుస్తోంది.




ప్రస్తుతం రకుల్ 'దే దే ప్యార్ దే 2' సినిమా సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర 'ఆయేషా'కు ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమను చూసి ఎంతో సంతోషంగా ఉన్నట్లు క్యాప్షన్​లో పేర్కొన్నారు. అజయ్ దేవ్​గణ్, ఆర్. మాధవన్ వంటి అద్భుతమైన నటులతో కలిసి పనిచేయడం, వారు తనకు స్పేస్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో తెలుగు తెరకు పరిచయమైన రకుల్, తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్​గా ఎదిగారు. ఇప్పుడు బాలీవుడ్​లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్​ను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.

పెళ్లి తర్వాత కూడా రకుల్ తన కెరీర్ స్పీడ్ ఏమాత్రం తగ్గించలేదు. సినిమాలతో బిజీగా ఉంటూనే, సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలు, ఫిట్​నెస్ వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్​కు నిత్యం టచ్​లో ఉంటున్నారు. గ్లామర్​లోనూ, నటనలోనూ తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. ఇక తెలుగులో ఆమె నటించి చాలా కాలమైంది. మరి రానున్న రోజుల్లో మళ్ళీ బిజీ అవుతుందో లేదో చూడాలి.