పిక్‌టాక్ : బ్లాక్ అండ్ రెడ్‌లో డిస్నీ ప్రిన్సెస్
కన్నడ మూవీ గిల్లితో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు టాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది.
By: Ramesh Palla | 19 Feb 2026 10:00 PM ISTకన్నడ మూవీ గిల్లితో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు టాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. తెలుగులో మొదటగా ఈఅమ్మడు కెరటం సినిమాను చేయడం ద్వారా టాలీవుడ్‌లో పరిచయం అయింది. 2013లో ఈ అమ్మడు తెలుగులో చేసిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డం దక్కించుకుంది. చిన్న సినిమాల హీరోయిన్ కాస్త స్టార్ హీరోయిన్‌గా మారి పోయింది. హీరోయిన్‌గా ఈ అమ్మడు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా టాప్ స్టార్స్ తో నటించే అవకాశాన్ని దక్కించుకోవడంతో టాప్ స్టార్ హీరోయిన్‌గా మారి పోయింది. సాధారణంగానే హీరోయిన్స్‌కి కెరీర్ స్పాన్ తక్కువ అంటారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ టాప్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే సడెన్‌గా ఆఫర్లు తక్కువ అయ్యాయి. అందం విషయంలో ఏమాత్రం తగ్గకున్నా ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గి పోయాయి.
రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఫోటో షూట్...
టాలీవుడ్ నుంచి ఆఫర్లు తగ్గినా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగింది. ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త ఎక్కువ గ్యాప్ వస్తోంది. అయితే ఈ గ్యాప్‌లో ఫోటో షూట్స్ తో రకుల్ ప్రీత్ సింగ్ కుమ్మేస్తోంది. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు, మోడలింగ్ లో పట్టు ఉండటం వల్ల రకుల్ ప్రీత్ సింగ్ ఏ ఫోటో షూట్ చేసినా కూడా బాగా వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందాల ఆరబోత ఫోటో షూట్‌తో సర్‌ప్రైజ్ చేసింది. టాలీవుడ్ లో ఈ అమ్మడు మరికొంత కాలం పెద్ద హీరోలతో సినిమాలు చేసేంత అందం ఉందని నిరూపించుకుంటూ తాజాగా ఫోటోలను షేర్ చేసింది.
డిస్నీ ప్రిన్సెస్ లుక్ లో రకుల్ ప్రీత్ సింగ్...
డిస్నీ ప్రిన్సెస్ లుక్ లో రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబోలో చేసిన ఈ అందాల ఆరబోత అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగానే రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత విషయంలో చాలా ముందు ఉంటుంది. కానీ ఈసారి అంతకు మించి అన్నట్లుగా రకుల్ అందంగా కనిపిస్తోంది అంటూ ఆమె ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా డిస్నీ బ్యూటీ అన్నట్లుగా రకుల్ ను తెగ పొగడ్తు కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇంత అందంగా ఉన్నప్పటికీ ఏ భాషలోనూ పెద్ద సినిమాల్లో ఆఫర్లు రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా మళ్లీ స్టార్ హీరోల సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ నటించే అవకాశాలు దక్కించుకుంటుంది అనే విశ్వాసంను ఆమె ఫాలోవర్స్ ముఖ్యంగా ఆమెను హీరోయిన్‌గా అభిమానించే వారు భావిస్తున్నారు.
టాలీవుడ్, బాలీవుడ్...
ఇప్పటికే టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో ఆమె సన్నిహితంగా ఉంటుంది. అయితే ఆమెకు తగ్గ ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఒకటి రెండు సంవత్సరాలు ఆగి ఇతర హీరోయిన్స్ మాదిరిగానే రకుల్ ప్రీత్ సింగ్ సైతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని కొందరు సూచిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్స్ పాత్రలు కాకుండా కథలో ప్రాధాన్యత ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు ఆమె చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మరో పదేళ్ల పాటు హీరోయిన్ గానే నటించేందుకు గాను ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తుంది. టాలీవుడ్‌లో కాకున్నా ఇతర భాషల్లో అయినా ఈ అమ్మడికి హీరోయిన్ గా ఆఫర్లు దక్కేనా చూడాలి. అందం, అభినయం విషయంలో ఏమాత్రం తగ్గని ఈ అమ్మడు లక్ కలిసి రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
