పాటతో రచ్చ... రకుల్ చివరి ప్రయత్నం ఏమయ్యేనో?
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
By: Ramesh Palla | 30 Oct 2025 5:13 PM ISTటాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తెలుగులో ఈమె హీరోయిన్‌గా నటించిన సినిమా వచ్చి చాలా కాలం అయింది. టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గిన సమయంలో బాలీవుడ్ నుంచి ఈ అమ్మడికి పిలుపు వచ్చింది. బాలీవుడ్‌లో ఒకే ఏడాది ఏకంగా నాలుగు అయిదు సినిమాలు చేసింది. కానీ హిందీలో ఈమె చేసిన ఏ ఒక్క సినిమా కమర్షియల్‌గా ఆడలేదు. పర్వాలేదు అనిపించుకున్న సినిమాల్లో ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. మొత్తంగా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌కి కూడా దూరం అయ్యే పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈమె ఒకే ఒక్క సినిమా చేస్తూ, దానిపైనే ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. ఆ చివరి ప్రయత్నం ఎంత వరకు వర్కౌట్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దే దే ప్యార్ దే 2 సినిమాతో...
రకుల్ ప్రీత్‌సింగ్ 2019లో నటించిన దే దే ప్యార్ దే సినిమా అప్పుడు కమర్షియల్‌గా పర్వాలేదు అనిపించింది. అంతే కాకుండా ఆ సినిమాలోని రకుల్ పాత్రకు పేరు వచ్చింది. అందుకే ఆ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించేందుకు మేకర్స్ ముందుకు వచ్చారు. సీక్వెల్ అనగానే హీరో అజయ్ దేవగన్ అని అంతా అనుకున్నారు. అయితే హీరోయిన్‌గా రకుల్‌కి మళ్లీ ఛాన్స్ వచ్చేనా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. కానీ లక్కీగా ఈ అమ్మడికి ఛాన్స్ దక్కింది. దే దే ప్యార్ దే 2 సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మొదలు పెట్టారు. తాజాగా జూమ్ షరాబి అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ద్వారా అందరి దృష్టిని చిత్ర యూనిట్ సభ్యులు ఆకర్షించారు.
అజయ్ దేవగన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్...
జూమ్ షరాబి పాటలో రకుల్ ప్రీత్ సింగ్ స్క్రీన్ ప్రజెన్స్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆమె అందాల ఆరబోతతో చూపు తిప్పనివ్వలేదు అంటూ పాటను చూసిన వారు అంటున్నారు. రకుల్ అందాలను చూడ్డానికి అన్నట్లుగా యూట్యూబ్‌లో ఈపాటను రిపీట్ గా చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దే దే ప్యార్ దే 2 సినిమాకు ఇప్పటి వరకు పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు అనుకుంటున్న వారికి సమాధానం అన్నట్లుగా ఈ పాట నిలిచింది. ఈ ఒక్క పాటతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఈ పాటలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన రచ్చతో మొత్తం సీన్ మారింది. రకుల్ చివరి ప్రయత్నం అన్నట్లుగా రాబోతున్న ఈ సినిమా ఫలితాన్ని ఈ పాట ప్రభావితం చేస్తుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తూ ఉండగా, భూషన్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
రకుల్ ప్రీత్ సింగ్ లాస్ట్ ఛాన్స్...
దే దే ప్యార్ దే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవగన్ ప్రేమ కథ విభిన్నంగా సాగుతుంది. తన తండ్రి వయసు ఉండే వ్యక్తితో ప్రేమలో పడే ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథతో దే దే ప్యార్ దే సినిమా సాగుతుంది. మరి ఈ సీక్వెల్‌లో ఎలాంటి కథను దర్శకుడు ఎంపిక చేసుకున్నాడు అనేది చూడాలి. ఈ సినిమాలో అజయ్ దేవగన్ తన వయసుకు తగ్గ పాత్రను ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఈ సినిమాలోనూ తనదైన శైలి నటనతో ఆకట్టుకుంటాడు అనే విశ్వాసంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దే దే ప్యార్ దే 2 కి సంబంధించిన చర్చ పాట వల్ల మొదలైంది. కనుక రకుల్ చేస్తున్న ఈ చివరి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే మరో ఐదేళ్ల పాటు రకుల్ ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఫలితం తారుమారు అయితే పరిస్థితి ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
