రకుల్ సినిమాకు బుకింగులు లేవా?
అయితే పెళ్లి తర్వాతా రకుల్ నటనా కెరీర్ కి, స్వేచ్ఛకు ఎలాంటి భంగం లేదు. ఈ బ్యూటీ మునుపటి కంటే ఎక్కువగా రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది.
By: Sivaji Kontham | 13 Nov 2025 9:26 AM ISTపంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో అగ్రకథానాయికగా హోదాను ఆస్వాధించిన సంగతి తెలిసిందే. ఇతర భామల్లానే రకుల్ కూడా తెలుగు చిత్రసీమలో పాపులరై తమిళ పరిశ్రమలో కొంతకాలం కెరీర్ సాగించి చివరకు బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ ప్రముఖ నిర్మాత-నటుడు జాకీ భగ్నానీని పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది. ఫిట్నెస్ ఫ్రీక్స్ రకుల్- జాకీ జంట అన్యోన్యత యవ జంటలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
అయితే పెళ్లి తర్వాతా రకుల్ నటనా కెరీర్ కి, స్వేచ్ఛకు ఎలాంటి భంగం లేదు. ఈ బ్యూటీ మునుపటి కంటే ఎక్కువగా రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది. బికినీలు స్విమ్ సూట్లతో చెలరేగుతోంది. ఇంతకుముందు `దేదే ప్యార్ దే` చిత్రంలో తనకంటే వయసులో చాలా సీనియర్ అయిన యాక్షన్ హీరో అజయ్ దేవగన్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో జీవించిన రకుల్ ఆరబోతకు ఎలాంటి అభ్యంతరం చెప్పని సంగతి తెలిసిందే.
రకుల్ గ్లామరస్ ట్రీట్ గురించిన ఊహాగానాలు ఇప్పుడు `దే దే ప్యార్ దే` సీక్వెల్ పై అంచనాలు పెంచుతున్నాయి. అయితే సీక్వెల్ సినిమా మొదటి భాగంలా ముందస్తు బుకింగుల్లో ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం నిరాశపరుస్తోంది. రొమాంటిక్ కామెడీ `దే దే ప్యార్ దే 2` ఈ వారాంతంలో థియేటర్లలోకి రానుండగా బుకింగులు నీరసంగా ప్రారంభమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. మొదటి రోజు కేవలం 5-6కోట్ల రేంజులో మాత్రమే ఈ సినిమా వసూలు చేయగలదని ట్రేడ్ చెబుతోంది.
చాలా కాలంగా స్థిరంగా రాణిస్తున్నా కానీ దేవగన్ సినిమాకి ఇంత దిగువ స్థాయికి ఓపెనింగులు పడిపోవడం ఆశ్చర్యపరుస్తోంది. రకుల్ తో కథానాయకుడి రొమాంటిక్ సన్నివేశాలకు కొదవేమీ ఉండదన్న భరోసా ఉన్నా కానీ, ఈ సీక్వెల్ చిత్రానికి ఓపెనింగులు లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ప్రచారం పరంగా అంతంత మాత్రంగానే ఉండటం, హైప్ పెంచకుండా థియేట్రికల్ రిలీజ్ కి ప్లాన్ చేయడం కూడా ఈ పరిస్థితికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాలో రొమాంటిక్ డ్రామా, ఫ్యామిలీ ఆడియెన్ మెచ్చే సెంటిమెంట్, కామెడీ వర్కవుటైతే, నెమ్మదిగా వసూళ్ల గ్రాఫ్ పెరుగుతుందని టీమ్ భావిస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో మల్టీప్లెక్సుల్లో టికెట్ బుకింగ్ బావున్నా కానీ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆశించిన వసూళ్లు రావడం లేదని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాకి ఆర్.మాధవన్ ఫ్యాక్టర్ కూడా అంతగా కిలిసి రాలేదు. నిజానికి ఇతర పెద్ద సినిమాల మాదిరిగా ప్రచారాన్ని హైప్ చేయలేదు. కేవలం పార్ట్ 1 ఆడింది గనుక సీక్వెల్ కి ఆదరణ ఉంటుందని భావించారు. కానీ ఆశించినది జరగలేదు. దేదే ప్యార్ దే 2 ట్రైలర్ యువతరంలోకి దూసుకెళ్లడంలో విఫలమైందని కూడా చెబుతున్నారు. ఒకవేళ ప్రేక్షకుల సమీక్షలు అనుకూలంగా ఉంటే, విడుదల తర్వాత వసూళ్లు పెరిగే ఛాన్సుంటుందని, మౌత్ టాక్ కీలక పాత్ర పోషించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో బయోపిక్ లు, భారీ యాక్షన్ ఎంటర్ టైనర్లకు ఆదరణ దక్కుతోంది. స్పై యూనివర్శ్‌లు భారీ ఓపెనింగులు తేగలుగుతున్నాయి. దేదే ప్యార్ దే లాంటి లైటర్ వెయిన్ స్టోరీకి ఆరంభ వసూళ్లు తక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు.
