ప్రతి శ్వాస శాంతికి మెట్టు.. ఇంటర్నేషనల్ యోగ డే స్పెషల్.. రకుల్ పోస్ట్!
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు, యోగాకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ముఖ్యంగా మిగతా సెలబ్రిటీలతో పోల్చుకుంటే ఈ బంధం ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి కాస్త ఎక్కువే అనే చెప్పాలి.
By: Madhu Reddy | 21 Jun 2026 4:47 PM ISTసినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు, యోగాకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ముఖ్యంగా మిగతా సెలబ్రిటీలతో పోల్చుకుంటే ఈ బంధం ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి కాస్త ఎక్కువే అనే చెప్పాలి. నిత్యం తన భర్తతో కలిసి భిన్న విభిన్నమైన ఆసనాలు వేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరొకసారి తన శరీరానికి పని పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఇక అందులో భాగంగానే మరొకసారి తన శరీరాన్ని విల్లులా వంచుతూ చాలా సునాయాసంగా ఆసనాలు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది రకుల్ ప్రీత్ సింగ్. ముఖ్యంగా యోగాసనాలలో భాగంగా గురువు సమక్షంలో అతి క్లిష్టమైన ఆసనాలను వేస్తూ అందరిని మెప్పించింది. అంతేకాదు వెళ్లకిలా కిందికి వేలాడుతూ ఆశ్చర్యపరిచింది. ఈ ఫోజులకు క్యాప్షన్ గా.." ప్రతి సాగదీత బలానికి ఒక మెట్టు.. ప్రతి శ్వాస శాంతికి ఒక మెట్టు.. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ పంచుకుంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఆకట్టుకోగా.. ఈమె షేర్ చేసిన ఈ ఫోజులను యువత కూడా ఫాలో అవుతున్నట్లు సమాచారం.
1990 అక్టోబర్ 10న ఢిల్లీలో జన్మించిన ఈమె.. గణితశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకుంది. 2009లో కన్నడ చిత్రం గిల్లీ ద్వారా నటన రంగ ప్రవేశం చేసిన రకుల్.. 2011లో వచ్చిన కెరటం అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అదే ఏడాది యువన్ అనే చిత్రం ద్వారా తమిళ సినీ రంగానికి కూడా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అయితే 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే చిత్రం ద్వారా మరింత పాపులారిటీ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో వరుసగా అవకాశాలనందుకుంటూ మరింత పేరు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
అలా రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ ,నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్ ఇలా 2013 నుండి 2017 వరకు దాదాపు 5 సంవత్సరాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటిన ఈమె.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఒక్కొక్కటిగా డిజాస్టర్ అవడం మొదలుపెట్టాయి. అలా ఎన్టీఆర్ కథానాయకుడు , మన్మధుడు 2 చిత్రాలలో నటించి తెలుగు తెరకు దూరమైంది. ఇక చివరిగా కొండ పొలం అనే సినిమాలో నటించిన ఈమె.. మళ్లీ 2023లో బూ అనే తమిళ్, తెలుగు ద్విభాష చిత్రంలో నటించింది. ఇక మళ్ళీ తెలుగు సినిమా చేయని రకుల్ గత ఏడాది దే దే ప్యార్ దే 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
