Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : మత్తెక్కించే చూపులతో చంపేస్తోంది

అయితే అందం విషయంలో ఇప్పటికీ ఈ అమ్మడు కొత్త హీరోయిన్స్‌ కి పోటీ అన్నట్లుగా నిలుస్తూ సోషల్‌ మీడియా ద్వారా తన ఫోటోలను షేర్‌ చేస్తూ వస్తోంది.

By:  Ramesh Palla   |   23 Dec 2025 11:13 AM IST
పిక్‌టాక్‌ : మత్తెక్కించే చూపులతో చంపేస్తోంది
X

కెరటంతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. కెరీర్‌ ఆరంభంలో చిన్న హీరోలతో, చిన్న సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత స్టార్‌ హీరోలతో, పెద్ద బడ్జెట్‌ సినిమాల్లో క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో స్టార్‌ హీరోల సినిమాలకు సైతం డేట్లు లేవు అని చెప్పేంత బిజీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాలు చేసింది. అయితే రకుల్‌ కెరీర్ ను చాలా మంది గాలి బుడగతో పోల్చుతూ ఉంటారు. ఒక్కసారిగా పెరిగిన ఆమె స్టార్‌డం, క్రేజ్‌ అదే స్థాయిలో తగ్గింది. టాలీవుడ్‌లో మూడు నాలుగు సంవత్సరాలు బిజీగా ఉన్న రకుల్‌ కి ఆ తర్వాత మినిమం ఆఫర్లు కూడా కనిపించడం లేదు. గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌ కి రకుల్‌ ప్రీత్‌ సింగ్ దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగులో ఈమెకు ఆఫర్లు కరువయ్యాయి.




అందమైన ఫోటోలతో రకుల్‌ ప్రీత్‌సింగ్‌

కొండపొలం తర్వాత రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి తెలుగులో సాలిడ్‌ పాత్ర దక్కలేదు. ఇక హిట్‌ దక్కి కూడా చాలా ఏళ్లు అయింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌లో ఆఫర్లు రాని సమయంలో మెల్లగా బాలీవుడ్‌కి దారి వేసుకుంది. అక్కడ మంచి ఆఫర్లు దక్కించుకుంది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఒకటి రెండు పర్వాలేదు అనిపించుకున్నా ఓవరాల్‌గా ఈ అమ్మడి కెరీర్‌ ఖతం అయినట్లుగానే అనిపిస్తోంది. అయితే అందం విషయంలో ఇప్పటికీ ఈ అమ్మడు కొత్త హీరోయిన్స్‌ కి పోటీ అన్నట్లుగా నిలుస్తూ సోషల్‌ మీడియా ద్వారా తన ఫోటోలను షేర్‌ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఎప్పటిలాగే తన అందమైన ఫోటోలతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వార్తల్లో నిలిచింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాల ఆరబోత ఫోటోలు చూసిన ప్రతి సారి ఆమె ఫాలోవర్స్ లో ఎక్కువ శాతం మంది రకుల్‌ కి ఇంకొంత కాలం హీరోయిన్‌గా నటించే అర్హత ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు.




రకుల్‌ క్లీవేజ్‌ షో అందాలు..

తాజాగా ఈ అమ్మడు మత్తెక్కించే చూపులతో మేకప్ మిర్రర్‌ ముందు నిల్చుని అందంగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. కవ్వించే విధంగా ఉన్న ఈ అమ్మడి చూపులకు ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే. ఆకట్టుకునే అందంతో పాటు ఆమె ధరించిన బ్లాక్ కలర్‌ ఔట్‌ ఫిట్‌ ఆమె అందంను మరింతగా పెంచింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. క్లీ వేజ్ షో చేస్తూ లూజ్‌ హెయిర్‌ తో సింపుల్‌ మేకోవర్‌ తో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇచ్చిన ఈ అందాల ఫోజ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అవుతున్నా ఇప్పటికీ అంతకు మించి అన్నట్లుగానే అందంగా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్ కి అదృష్టం కలిసి రాకపోవడం వల్లే సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు తగ్గాయి, బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చినా సక్సెస్‌ రాలేదు అనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు.




టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో..

కన్నడ మూవీ గిల్లి తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎన్టీఆర్‌ తో కలిసి నాన్నకు ప్రేమతో, రామ్‌ చరణ్‌తో కలిసి బ్రూస్‌లీ, అల్లు అర్జున్‌తో సరైనోడు ఇలా చెప్పుకుంటూ పోతే మూడు ఏళ్లలో దాదాపు టాలీవుడ్‌ స్టార్‌ హీరోల అందరితోనూ సినిమాలు చేసింది. దాంతో ఈమెకు టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కింది. ఆ సమయంలో టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గానూ నిలిచింది. ఇప్పుడు మాత్రం ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. కెరీర్‌ సాఫీగా సాగని ఈ సమయంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో ముందు మాదిరిగా నటించేందుకు రెడీగా ఉంది. ఇలాంటి అందమైన ఫోటోలు షేర్‌ చేసిన సమయంలో రకుల్‌ ఖచ్చితంగా తన పూర్వ వైభవంను సంతరించుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.