బ్లూ వెలుగుల్లో హీట్ పెంచేసిన రకుల్!
రకుల్ ప్రీత్ సింగ్.. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక అద్భుతమైన క్షణం జరిగే ఉంటుంది.
By: Madhu Reddy | 2 March 2026 5:00 PM ISTరకుల్ ప్రీత్ సింగ్.. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక అద్భుతమైన క్షణం జరిగే ఉంటుంది. అయితే ఇప్పుడు తన జీవితంలో ఆ మధురమైన క్షణం ఈరోజు వచ్చింది అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్న ఫోటోలు అభిమానులను ఆనందానికి గురి చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఈమె నటించిన 'దేదే ప్యార్ దే 2' సినిమాకి గాను బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా జీ సినీ అవార్డ్స్ 2026 వేడుకల్లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ అవార్డు అందుకున్న క్షణాలకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
ఇందులో బ్లూ గ్లిటర్తో డిజైన్ చేసిన ఒక అందమైన డ్రెస్ ధరించి తన అందాలతో వేడుకకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఫ్రంట్ డీప్ వీ నెక్ తో డిజైన్ చేసిన ఈ డ్రెస్ ఈమె అందాలను రెట్టింపు చేసింది. అసలే వైట్ స్కిన్ టోన్ దీనికి తగ్గట్టు బ్లూ డ్రెస్ ఇక ఈమె అందాలను ఏ విధంగా మార్చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికైతే బ్లూ డ్రెస్ లో జీ సినీ అవార్డ్స్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే మరొకవైపు ఇలా క్యాప్షన్ జోడించింది. "చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి జీ సినీ అవార్డును అందుకోవడం ..అందులోనూ దేదే ప్యార్ దే 2 చిత్రానికి బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రయాణాలు ఎప్పుడు మీతోనే ఉంటాయి. అది ప్రేమ, నవ్వు ఇలా ఎప్పటికీ గుర్తించుకునే జ్ఞాపకాలతో ఆ ప్రయాణం నిండి ఉంటుంది.నాకు మద్దతుగా నిలిచిన అజయ్ దేవగన్, యాక్టర్ మాధవన్, చిత్ర బృందానికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నన్ను నమ్మి ఆదరిస్తున్న అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటూ రకుల్ ప్రీత్ సింగ్ క్యాప్షన్ జోడించింది.
రకుల్ ప్రీత్ సింగ్ విషయానికొస్తే.. ఒకప్పుడు సౌత్ సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ముఖ్యంగా రామ్ చరణ్ , అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కి విచ్చేసిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడే సినిమాలు చేస్తూ వచ్చింది. పైగా ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసి.. ఇప్పుడు అక్కడే సినిమాలు చేస్తూ.. తన భర్తతో కలిసి సినిమాలు నిర్మిస్తూ బిజీగా మారిపోయింది. ఇప్పుడు అవార్డు లభించడంతో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.
