Begin typing your search above and press return to search.

రకుల్ స్పెషల్ వీడియో.. మరింత బజ్ పెంచిందిగా..

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం పతి పత్నీ ఔర్ వో దో మూవీ ప్రమోషన్స్‌ లో బిజీగా ఉన్నారు.

By:  M Prashanth   |   11 May 2026 10:38 PM IST
రకుల్ స్పెషల్ వీడియో.. మరింత బజ్ పెంచిందిగా..
X

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం పతి పత్నీ ఔర్ వో దో మూవీ ప్రమోషన్స్‌ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా, తాజాగా రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ స్పెషల్ సాంగ్ షూట్ వీడియో వైరల్‌ గా మారింది. గ్లామరస్ లుక్స్, స్టైలిష్ కాస్ట్యూమ్స్‌ తో కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ప్రతి సీరియస్ షూట్‌ లోనూ మరో యాంగిల్ ఉంటుంది. ఈ పాట ఇంకా వినకపోతే వెంటనే వినండంటూ ఆమె వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో సాంగ్ షూట్‌ కు రెడీ అవుతున్న మూమెంట్స్ తో పాటు సెట్స్‌ లోని సరదా విజువల్స్‌ ను కూడా చూపించారు. సాంగ్ అవుట్ పుట్ విజువల్స్ ను యాడ్ చేశారు. ముఖ్యంగా రకుల్ హీట్ పుట్టించే లుక్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి.

అయితే రకుల్ స్పెషల్ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి. నెటిజన్లు వీడియోకు లైక్ కొడుతూ, షేర్ చేస్తూ ఫుల్ వైరల్ చేస్తున్నారు. ఇక పతి పత్నీ ఔర్ వో దో చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు ముదస్సిర్ అజీజ్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా 2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ పతి పత్నీ ఔర్ హోకు సీక్వెల్‌ గా రూపొందుతోంది.

కామెడీ, కన్ఫ్యూజన్, రిలేషన్‌ షిప్ డ్రామాగా గా సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మూవీలో ఆయుష్మాన్ ఖురానా ప్రజాపతి పాండే అనే ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఒక స్నేహితురాలికి సహాయం చేయాలనే ప్రయత్నంలో అతని జీవితం ఎలా గందరగోళంగా మారుతుందనేది కథాంశంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి ఒకరితో కాదు, ముగ్గురు హీరోయిన్లతో ఆయన పాత్ర పడే ఇబ్బందులు కామెడీగా చూపించనున్నట్లు ట్రైలర్‌ లో హైలైట్ చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్‌ తో పాటు సారా అలీ ఖాన్, వామిక గబ్బి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే విజయ్ రాజ్, తిగ్మాంషు ధులియా, అయేషా రజా వంటి నటీనటులు కూడా సినిమాలో కనిపించనున్నారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. కన్నడ చిత్రం గిల్లితో సినీ ప్రయాణం ప్రారంభించిన ఆమె, తర్వాత టాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌ పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఇక ఇప్పుడు పతి పత్ని ఔర్ వో దో సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. స్పెషల్ వీడియోతో మూవీపై మరింత బజ్ పెంచారు.