రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!
‘రామాయణ: పార్ట్ 1’లో శూర్పణఖగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్రకు వస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఇతిహాసంలో భాగం కావడం గర్వంగా ఉందంటూ షూటింగ్ ఫొటోలను షేర్ చేసి దర్శకుడు నితీశ్ తివారీ, సహనటీనటులు, హెయిర్ అండ్ మేకప్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెరపై కొద్దిసేపే కనిపించినా తన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
By: Madhu Reddy | 6 Nov 2026 4:16 PM ISTప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామాయణ: పార్ట్ 1’కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ తన లుక్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే రకుల్ సోషల్ మీడియాలో షూటింగ్ నాటి ఫొటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాశారు. మన దేశపు సంస్కృతిలో భాగమైన ఈ కథలో నటించడం తన అదృష్టమని ఆమె చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు ఇలా వున్నాయి..
శూర్పణఖగా మారడం ఓ కొత్త అనుభవం:
రామాయణం లాంటి గొప్ప కథలో శూర్పణఖ పాత్ర చేయడానికి తాను ఎంతో కాలంగా ఎదురుచూశానని రకుల్ చెప్పారు. తరతరాలుగా మన జీవితాల్లో భాగమైన ఈ ఇతిహాసంలో నటించడం ప్రతిరోజూ దొరికే అవకాశం కాదని ఆమె అన్నారు. ఇక ముఖ్యంగా రామరావణ యుద్ధానికి ప్రధాన కారణమైన శూర్పణఖ పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయని, ఆ పాత్రను సరిగ్గా చూపించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రకుల్ పేర్కొన్నారు.
మేకర్స్, కో-స్టార్స్‌కు రకుల్ థ్యాంక్స్:
భారతీయ కథను ఇంత భారీ స్థాయిలో ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు నితీశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాలకు రకుల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాముడిగా చేసిన రణ్‌బీర్ కపూర్, సీతగా నటించిన సాయిపల్లవి, రావణుడిగా కనిపించిన యశ్‌తో పాటు కాజల్ అగర్వాల్, శోభన, రవి దూబేల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక వీరందరూ ఎంతో కష్టపడి ఈ మ్యాజిక్‌ను స్క్రీన్ పైకి తెచ్చారని ఆమె అభినందించారు.
హెయిర్ అండ్ మేకప్ టీమ్ కష్టం:
శూర్పణఖ పాత్రకు తగ్గట్టుగా తన లుక్‌ను తీర్చిదిద్దిన హెయిర్ అండ్ మేకప్ టీమ్‌కు రకుల్ క్రెడిట్ ఇచ్చారు. ట్రైలర్ వచ్చినప్పటి నుంచే తన గెటప్‌కు మంచి రెస్పాన్స్ రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఒక భారతీయురాలిగా గర్వపడే క్షణమని రకుల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
సినిమాలో లీడ్ రోల్స్ ఎంత బాగా చేసినా, కొన్నిసార్లు సైడ్ క్యారెక్టర్లు లేదా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలేన అవి ఆడియన్స్ చాల కాలం గుర్తుంచుకుంటారు. ఇక ఇప్పుడు 'రామాయణ' సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ చేసింది అదే జాబితాలోకి వస్తుంది. స్క్రీన్ మీద ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా, ఆ తక్కువ టైంలోనే తన అద్భుతమైన హావభావాలతో థియేటర్లలో ఉన్నవాళ్లందరినీ కట్టిపడేసింది. ఇప్పటివరకు సినిమాల్లో వచ్చిన శూర్పణఖ పాత్రలన్నింటికంటే రకుల్ చాలా డిఫరెంట్‌గా, మోస్ట్ బ్యూటిఫుల్ రాక్షస పాత్రలా కనిపించిందని ఫాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.
ఇక మొత్తానికి శూర్పణఖ పాత్రతో రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెరపై ఆమె కనిపించిన తీరు, ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన షూటింగ్ విశేషాలు ఫాన్స్ ను మెప్పిస్తున్నాయి.
