బీచ్‌లో రకుల్ ప్రీత్ స్టన్నింగ్ ఫోజ్
తనదైన అందం, అద్భుత రూపలావణ్యంతోను రకుల్ ప్రీత్ మనసులను గెలుచుకుంటోంది.
By: Sivaji Kontham | 6 Nov 2025 9:24 AM ISTరకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అవసరం లేదు. దక్షిణాదిన అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన రకుల్ ఫిట్నెస్ ఫ్రీక్ గాను ప్రజల మనసులపై చెరగని ముద్ర వేసింది. నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడిన తర్వాత రకుల్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. జాకీ భగ్నానీ కూడా రకుల్ మాదిరిగానే ఫిట్నెస్ ఫ్రీక్ కావడంతో, ఈ జంట భారతదేశంలో అత్యంత ఫిట్టెస్ట్ కపుల్ గా పురస్కారాలను కూడా గెలుచుకున్నారు. హెల్దీ ఇండియా ప్రచారంలో ప్రధాని మోదీ ప్రశంసలను ఈ జంట అందుకున్నారు. ముఖ్యంగా రకుల్ అద్భుతమైన సమయపాలన, క్రమశిక్షణతో ఎల్లపుడూ తన అభిమానులకు ఫిట్నెస్ గోల్స్ ని సెట్ చేస్తూనే ఉంది.
తనదైన అందం, అద్భుత రూపలావణ్యంతోను రకుల్ ప్రీత్ మనసులను గెలుచుకుంటోంది. ఇటీవల ఈ పంజాబీ బ్యూటీ ప్యూర్ ప్రెజెన్స్ అవార్డును గెలుచుకుంది. ఈ పురస్కారం కోసం పలువురు భామలు పోటీపడగా, చివరికి అవార్డ్ రకుల్ నే వరించింది. బాలీవుడ్ లో నిజమైన అందగత్తె ఎవరు? అనే చర్చకు ఇది దారితీసింది. దీపికా పదుకొనే, కృతి సనన్, అలియా భట్, రకుల్ ప్రీత్ సింగ్‌లను పరిశ్రమ `స్వచ్ఛమైన అందగత్తె`లుగా భావిస్తున్నట్టు మెజారిటీ అభిమానులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ భామలు సహజ సౌందర్యానికి ప్రతీకలు అంటూ కితాబిచ్చేస్తున్నారు.
తాజాగా రకుల్ ప్రీత్ తన అభిమానుల కోసం సోషల్ మీడియాల్లో ఓ స్పెషల్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఈ ఫోటోషూట్ కోసం ప్రత్యేకించి బీచ్ ఇసుకలో ఒక సెట్ ని కూడా డిజైన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రకుల్ అందమైన చారల చొక్కా, దానికి కాంబినేషన్ గా థై స్లిట్ డెనిమ్స్ ఫ్రాక్‌ని ధరించి సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. రకుల్ తన మెడలో ధరించిన ప్రత్యేకమైన డిజైనర్ ఆభరణాన్ని హైలైట్ చేసిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ స్పెషల్ లుక్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది.
నేటి ప్రజలు పరిపూర్ణత కంటే వాస్తవికత వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. రకుల్ సహజ సౌందర్యం, ప్రత్యేక లక్షణాలు, అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ కి ఫిదా అయిపోయామని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒరిజినల్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకునే రకుల్ ను ఆరాధిస్తున్నారని చాలా మంది నెటిజనులు తాజా పోస్ట్ పై వ్యాఖ్యానిస్తున్నారు. రకుల్ ఫిల్టర్ లెస్ సౌందర్యానికి ఫిదా అయిపోయామని కొందరు ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్‌కి వస్తే.. 2009లో `గిల్లీ` అనే చిత్రంతో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్, 16ఏళ్ల కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. గత ఏడాది ఆయలాన్, ఇండియన్ 2 లాంటి భారీ చిత్రాల్లో నటించింది. 2025లో `మేరే హజ్బెండ్ కి బివి`లో అంతర ఖన్నా అనే పాత్రలో అద్బుతంగా నటించింది. ప్రస్తుతం అజయ్ దేవగన్ సరసన `దేదే ప్యార్ దే` సీక్వెల్‌లో నటిస్తోంది. `పతి పత్ని ఔర్ వో దో`, `ఇండియన్ 3` లాంటి భారీ చిత్రాల్లోను రకుల్ నటించాల్సి ఉంది. తదుపరి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
