పెళ్లైన వెంటనే తల్లవ్వడం తప్పా మేడం!
పెళ్లైన వెంటనే పిల్లల్ని కనడం తప్పు అనడం విడ్డూరంగా ఉందంటున్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయడం ఏంటి? అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
By: Srikanth Kontham | 25 Nov 2025 1:00 AM ISTజీవితంలో పెళ్లి..పిల్లలు సహజం. అవి రెండు సమయం వచ్చినప్పుడు తప్పక జరుగుతాయి. కానీ ఆ టైమ్ ఎప్పుడొ స్తుందన్నది ఎవరి చేతుల్లో ఉండదు. కాలానుగుణం జరిగే ప్రిక్రియలవి. పెళ్లి..పిల్లలకు ప్లానింగ్ ఉంటుంది. కానీ అందరి విషయంలో ప్లానింగ్ అన్నది అమలు కాకపోవచ్చు. వెనుక ముందు అవ్వొచ్చు..ముందు వెనకవొచ్చు. కొందరు పెళ్లైన కొన్ని నెలలకే గర్భం దాల్చుతుంటారు. సాంకేతికంగా అభివృద్ది చెందుతోన్న రోజుల్లో పిల్లలు పుట్టడం అన్నది అతి పెద్ద సమస్యగా మారింది. దేశంలో శిశు మరణాలు రేట్ అంతకంతకు పెరుగుతోంది.
పెళ్లైన వెంటనే పిల్లల్ని కనని ఫ్యామిలీ:
డాక్టర్లు అంతా పిల్లల్ని కనే విషయంలో? వీలైనంత త్వరగానే ప్లాన్ చేసుకోవాలని కొత్త దంపతులకు సూచనలిస్తున్నారు. కానీ నటి రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం వింత వాదనకు దిగింది. పెళ్లైన వెంటనే పిల్లల్ని కనడం అతి పెద్ద నేరంగా భావించినట్లు మాట్లాడింది. ఇలా పిల్లల్నికనే విధానం అన్నది రాతి యుగం నాటి పద్దతని.. ఇలా ఎవరు సృష్టించారో తనకు తెలియదంటూ సెటైరికల్ గా మాట్లాడింది. తమ ఇంట్లో మాత్రం ఎవరూ అలా పిల్లలను కనలేదని..ఓ ప్లానింగ్ ప్రకారం అంతా జరిగిందని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
రకుల్ వ్యాఖ్యలపై కొంత మంది నెటి జనులు మండిపడుతున్నారు.
రకుల్ రిప్లై ఎలా ఉండబోతుంది:
పెళ్లైన వెంటనే పిల్లల్ని కనడం తప్పు అనడం విడ్డూరంగా ఉందంటున్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయడం ఏంటి? అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెళ్లైన వెంటనే పిల్లల్ని కన్న వారంతా? తెలివి తక్కువ వారని రకుల్ అభిప్రాయమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. రకుల్ అందుకనే ఇంత వరకూ పిల్లల్ని కనలేదా? అంటున్నారు. పెళ్లైన వెంటనే పిల్లల్ని కన్న అలియాభట్...కియారా అద్వాణీ లాంటి వారు తప్పు చేసారు అంటావా? అని రకుల్ ని అడుగుతున్నారు. మరి వీటికి రకుల్ ప్రతీసింగ్ ప్రతి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
రకుల్ కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లగా నటిగా అక్కడే కొనసాగుతుంది. కానీ ఇంత వరకూ సరైన విజయం ఒక్కటీ లేదు. ఇబ్బడి ముబ్డడిగా సినిమాలు చేస్తున్నా? వాటి ఫలితాలు మాత్రం నిరాశనే మిగులుస్తున్నాయి. ప్రస్తుతం `పతీ పట్నీ ఔర్ వాహ్ డూ`లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది విడుదల కానుంది.
