ఒంటరి దీవుల్లో రకుల్ వర్సెస్ మంచు లక్ష్మీ
ఇప్పుడు మంచు లక్ష్మి ప్రసన్న ముంబై స్నేహితులతో కలిసి వీలున్న ప్రతి సందర్భాన్ని హాయిగా సెలబ్రేట్ చేస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
By: Sivaji Kontham | 30 Nov 2025 11:23 PM ISTజీవితం ఉన్నది ఒక్కటే.. అనుభవించు సోదరా! లైఫ్ లో ప్రతి క్షణాన్ని ఆస్వాధించడమెలా? వీలున్న ప్రతిసారీ సెలబ్రేషన్ లేనిదే పరమ బోరింగ్ గా ఉంటుంది. రొటీన్ బతుకులకు అలవాటు పడిన చాలా మందికి, జాలీ లైఫ్ కి అలవాటు పడిన సెలబ్రిటీలకు మధ్య డిఫరెన్స్ ఏమిటో యూత్ వేగంగా అర్థం చేసుకోగలదు.
ఇప్పుడు మంచు లక్ష్మి ప్రసన్న ముంబై స్నేహితులతో కలిసి వీలున్న ప్రతి సందర్భాన్ని హాయిగా సెలబ్రేట్ చేస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రొటీనిటీకి అలవాటు పడిన చాలా మందికి ఇది గుణపాఠం. కుటుంబంతో, స్నేహితులతో కలిసి అందమైన జీవితాన్ని ఎలా ఆస్వాధించాలో మంచు లక్ష్మి లైఫ్ స్టైల్ ఒక పాఠం.
తన స్నేహితురాలు రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల `దే దే ప్యార్ దే 2` విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు స్నేహితురాళ్లు ప్రగ్య జైశ్వాల్, మంచు లక్ష్మి కుటుంబాన్ని ఇన్వయిట్ చేసింది. ప్రస్తుతం రకుల్ - జాకీతో పాటు లక్ష్మీ మంచు, విద్యా నిర్వాణ, ఆనంద్ సహా ప్రగ్య జైశ్వాల్ ఆమె కుటుంబం కూడా మాల్దీవుల్లో చిలౌట్ చేస్తున్నారు.
ఇంతకుముందు వారంతా గ్రూప్‌గా ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. జాకీ-రకుల్ హ్యాపీ కపుల్ లుక్ అదరినీ ఆకట్టుకుది. ఇప్పుడు రకుల్ సోలో బికినీ లుక్ కూడా వైరల్ గా మారుతోంది. అదే సమయంలో లక్ష్మీ మంచు తన వారసులతో కలిసి అద్భుతమైన బీచ్ వెకేషన్ ని సరదాగా గడిపిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గాళ్స్ గ్యాంగ్ సన్ గ్లాసెస్ ధరించి చిల్లింగ్ లుక్ తో వెదర్ ని వేడెక్కిస్తున్నారు. షార్ట్స్, టీషర్ట్స్, హాఫ్ స్లీవ్స్ ఇలా విభిన్నమైన దుస్తులలో కాజువల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.
పురుషులను పూజించడం నేర్పించారు:
ఇటీవల నిఖిల్ విజయేంద్రతో పాడ్ కాస్ట్ లో మంచు లక్ష్మిని తన లవ్ లైఫ్ గురించి అడిగినప్పుడు... తన ఆలోచనలను షేర్ చేసారు. ``నేను పిచ్చిగా, లోతుగా, తీవ్రంగా ప్రేమలో ఉన్నాను. తల్లిగా ఆ ప్రేమ నాకు ఉన్న ఏ ప్రేమను అధిగమించలేదని నేను అనుకుంటున్నాను. నాకు పురుషులను పూజించడం మాత్రమే నేర్పించారు. పురుషులు ఎలా ఉండాలి .. మహిళలు వారితో ఎలా ప్రవర్తించాలి అనే అవగాహన మాత్రమే నేర్పారు. నేను ఆ దశను దాటాను.. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో తిరిగి చూసుకున్నప్పుడు... (చేతులు ముడుచుకుని). నేను ఎక్కడ ఉన్నానో నాకు చాలా సంతోషంగా ఉంది`` అని అన్నారు.
భర్త ఆండీ అమెరికాలో నివసిస్తున్నందున ఆయనతో సహచర్యాన్ని కోల్పోతున్నారా? అని ప్రశ్నించగా,..``నేను ఏదీ మిస్ అవ్వను. నేను ఎప్పుడూ ఆండీని కలుస్తాను. మేము ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ యూనిట్. మేము ఆపిల్ (వారి కుమార్తె విద్యా నిర్వాణ) తో కలిసి పనిచేస్తున్నాము. అది చాలా ముఖ్యమైనది. దానికి మించి ఇప్పుడు ఏదీ పట్టింపు లేదు`` అని అన్నారు.
