రకుల్ ప్రీత్ అలసిపోయిన తర్వాత చేసే పని ఇదే!
టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల హైదరాబాద్ కంటే ముంబైకే అధిక ప్రాధాన్యతనివ్వడం చర్చగా మారింది.
By: Sivaji Kontham | 20 Aug 2025 12:00 AM ISTటాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల హైదరాబాద్ కంటే ముంబైకే అధిక ప్రాధాన్యతనివ్వడం చర్చగా మారింది. రకుల్ పూర్తిగా బాలీవుడ్ లో సెటిలవ్వడంతో సౌత్ లో అంతగా కనిపించడం లేదు. అయితే రకుల్ హిందీ సినిమాల్లో నటించినా తెలుగు, తమిళంలో వచ్చే పెద్ద అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది. అలా తనవైపు వచ్చిన భారీ చిత్రం `భారతీయుడు 2` ఆశించిన విజయం సాధించకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచింది. సౌత్ లో తన కెరీర్ కి బిగ్ బూస్ట్ ఇస్తుందని భావించిన సినిమా డిజాస్టర్ ఫలితం అందుకోవడంతో రకుల్ తిరిగి ఇటువైపు చూడలేదు.
ఇటీవలి కాలంలో వరుసగా కొన్ని బాలీవుడ్ క్రేజీ చిత్రాలకు సంతకాలు చేసింది. ప్రస్తుతం రెండు మల్టీస్టారర్లలో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో అజయ్ దేవగన్ సరసన `దేదే ప్యార్ దే` సీక్వెల్ త పాటు, ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలోని `పతి పత్ని ఔర్ వో 2` షూటింగ్‌లో రకుల్ బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కార్తీక్ ఆర్యన్ సినిమాకి సీక్వెల్. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, వామికా గబ్బి, టబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల పతి పత్ని ఔర్ వో 2 మొదటిరోజు చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డే-వన్ షూటింగ్‌ను ఎలా ముగించిందో తన అభిమానులతో షేర్ చేసింది. సెట్స్ లో సుదీర్ఘ సమయం అలసిపోయాక విశ్రాంతి తీసుకోవడానికి నాకు అనువైన మార్గమిదే! అంటూ ఒక స్పెషల్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసారు రకుల్. ఈ ఫోటోగ్రాఫ్ లో రకుల్ స్విమ్ చేసి రిలాక్స్ డ్ గా కనిపిస్తోంది. పింక్ స్విమ్మింగ్ క్యాప్, గాగుల్స్ ధరించి షైనీ లుక్ లో రీఫ్రెషింగ్‌గా కనిపించింది.
ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లోకి రాగానే అభిమానులు వరుసగా లవ్ ఈమోజీలను షేర్ చేసారు. ఈ సినిమాతో పాటు తన కెరీర్ లో కీలకమైన దేదే ప్యార్ దే 2 చిత్రీకరణను ముగించాల్సి ఉంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ కామెడీలలో ఇది ఒకటి. ఇందులో అజయ్ దేవగన్ కథానాయకుడిగా నటిస్తుండగా, ఆర్. మాధవన్ రకుల్ తండ్రిగా నటించనున్నారు. అన్షుల్ శర్మ దర్శకత్వం వహించగా లవ్ రంజన్ నిర్మిస్తున్నారు. అలాగే రణబీర్ కపూర్ రామాయణంలో రకుల్ ప్రీత్ రావణుడి సోదరి శూర్పణఖగా నటిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యష్, సాయిపల్లవి, రవి దూబే తదితరులు నటిస్తున్నారు. వీటితో పాటు రకుల్ ప్రీత్ వెటరన్ నటి నీనా గుప్తాతో కలిసి `అమీరి` అనే కామెడీ సినిమాలో కనిపిస్తుంది.
