Begin typing your search above and press return to search.

రక్షిత లేటెస్ట్ లుక్ వైరల్.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్

రవితేజ 'ఇడియట్' సినిమా గుర్తుందా? అందులో రవితేజ వెంటపడే ఆ గ్రీకు సుందరి రక్షితను ఎవరూ మర్చిపోలేరు.

By:  Madhu Reddy   |   4 April 2026 2:52 PM IST
రక్షిత లేటెస్ట్ లుక్ వైరల్.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్
X

రవితేజ 'ఇడియట్' సినిమా గుర్తుందా? అందులో రవితేజ వెంటపడే ఆ గ్రీకు సుందరి రక్షితను ఎవరూ మర్చిపోలేరు. మహేశ్‌బాబు, నాగార్జున, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోలతో జోడీ కట్టి ఒకప్పుడు సౌత్ ఇండియాను ఊపేసిన ఈ స్టార్ హీరోయిన్, ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా కాలం తర్వాత లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. వెండితెరకు దూరమైన రక్షిత ప్రస్తుత జీవితం, ఆమె లుక్ వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వివరాలు చూద్దాం..

అప్పట్లోనే స్టార్ డమ్.. రవితేజ నుంచి మహేశ్ వరకు:

రక్షిత అసలు పేరు శ్వేత. సినిమాల్లోకి వచ్చాక రక్షితగా మారింది. తండ్రి కొరియోగ్రాఫర్, తల్లి నటి కావడంతో ఆమెకు ఇండస్ట్రీ ఎంట్రీ ఈజీగానే దొరికింది. పునీత్ రాజ్‌కుమార్ సరసన కన్నడలో 'అప్పు' సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం, తెలుగులో 'ఇడియట్'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నాగార్జునతో 'శివమణి', మహేశ్‌బాబుతో 'నిజం', ఎన్టీఆర్‌తో 'ఆంధ్రావాలా' వంటి వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. ఇక తెలుగు, కన్నడ భాషల్లో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో రక్షిత ఒకరు.

ప్రేమ పెళ్లి.. సినిమాలకు సడెన్ గుడ్ బై:

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే రక్షిత ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 2007లో కన్నడ దర్శకుడు ప్రేమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక ఇక సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకుని వెండితెరకు పూర్తిగా దూరమైపోయింది. అయితే ఇక సినిమా రంగంపై ఉన్న మక్కువతో నిర్మాతగా మారి 'జోగయ్య', 'డీకే' వంటి చిత్రాలను నిర్మించింది. నటిగా కాకుండా తెర వెనుక ఉండి తన భర్త సినిమాలకు అండగా నిలిచింది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా తన కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది.

వైరల్ అవుతున్న లేటెస్ట్ లుక్.. గుర్తుపట్టలేనంతగా మార్పు:

తాజాగా రక్షిత బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో ఆమెను చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకప్పుడు నాజూగ్గా ఉన్న రక్షిత, ఇప్పుడు చాలా బొద్దుగా మారిపోయారు. ఇక ఆమెలో వచ్చిన ఈ మార్పు చూసి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. అయితే దీనిపై ఆమె గతంలోనే క్లారిటీ ఇచ్చారు. కొడుకు పుట్టిన తర్వాత థైరాయిడ్ సమస్య రావడంతోనే తాను ఇలా బరువెక్కానని, ఇప్పుడు తాను హీరోయిన్ కాదు కాబట్టి నాజూగ్గా ఉండాల్సిన అవసరం లేదని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి?:

నటనకు దూరమైనా రక్షిత బుల్లితెరపై మాత్రం సందడి చేస్తూనే ఉన్నారు. పలు కన్నడ రియాలిటీ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆమె తాజా లుక్ చూసి కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నా, మరికొందరు మాత్రం ఆమె ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటున్నారు. "మనుషులు అన్నాక వయసుతో పాటు మార్పులు సహజం, ఆమె ఇప్పటికీ తన నవ్వుతో అలరిస్తున్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏదేమైనా 'ఇడియట్' బ్యూటీ తన ఫ్యాన్స్‌కు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి. ఐతే రూపం మారినా అభిమానుల గుండెల్లో రక్షిత స్థానం అలాగే ఉంది.