Begin typing your search above and press return to search.

చూపుతో మొదలైన ప్రేమ.. శశివదనే ట్రైలర్ చూశారా?

టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ అట్లూరి.. లండన్ బాబులు, పలాస వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   29 Sept 2025 12:24 PM IST
చూపుతో మొదలైన ప్రేమ.. శశివదనే ట్రైలర్ చూశారా?
X

టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ అట్లూరి.. లండన్ బాబులు, పలాస వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు క్యూట్ విలేజ్ లవ్ స్టోరీ మూవీ శశివదనేతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సాయి మోహన్ ఉబ్బాన దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో కోమలి ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాను గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోశాల నిర్మిస్తున్నారు. రఘు కుంచె, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, ప్రవీణ్ యండమూరి, మహేష్, బాబీ కీలక పాత్రలు పోషించగా.. అనుదీప్‌ దేవ్‌ మ్యూజిక్ అందించారు.

అక్టోబర్ 10న సినిమా విడుదల కానుండగా, ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కొద్ది రోజుల క్రితం మేకర్స్ విడుదల చేసిన టీజర్.. అందరినీ ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శశివదనే ట్రైలర్ అందరినీ మెప్పిస్తూ దూసుకుపోతోంది.

పచ్చని అందాలు, పడవ ప్రయాణం, పల్లెటూరి ప్రజలు వంటి సీన్స్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. 'ప్రేమ ఆ చూపుతో మొదలైంది. కాలం బొమ్మలా ఆగిపోయింది. ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది' అంటూ హీరో చెబుతున్న డైలాగ్ తో ముందుకు సాగింది. ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయి కోసం హీరో తన ఊరు వదిలి పట్నానికి వస్తాడు.

ఆ తర్వాత హీరోహీరోయిన్ల లవ్ స్టోరీతోపాటు తండ్రీ కొడుకుల మధ్య ప్రమోషన్, పట్నంలో హీరో ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపించారు మేకర్స్. 2000 కాలంలో గోదారి నేపథ్యంలో ఫస్ట్ యాక్షన్ అండ్ లవ్ డ్రామాగా సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రేమ కోసం యుద్ధమంటూ.. ఓ దృశ్యకావ్యంగా మూవీని రూపొందిస్తున్నారని సమాచారం.

ట్రైలర్ అదిరిపోయిందని నెటిజన్లు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. 'ప్రేమ నా నుంచి ఎప్పటికీ దూరం కాదు కదా రాఘవ', 'నన్ను వాళ్ళు వీళ్ళు కాదు. నేను కూడా దూరం చేయలేను' అంటూ హీరోహీరోయిన్ల డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్ తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. అనుదీప్‌ దేవ్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా సెట్ అయింది. ప్యూర్ లవ్ స్టోరీని అందరినీ ఆకట్టుకునేలా డైరెక్టర్ రాసుకున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.