నిన్ను చీల్చి చెండాడతా - కోమల్ రాణికి రాఖీ సావంత్ వార్నింగ్!
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా- ఆయన భార్య సునీత అహూజా మధ్య నడుస్తున్న దాంపత్య వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.
By: Srikanth Kontham | 5 Oct 2026 12:35 AM ISTబాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా- ఆయన భార్య సునీత అహూజా మధ్య నడుస్తున్న దాంపత్య వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా ఈ వివాదంలోకి నటి రాఖీ సావంత్ ప్రవేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. గోవిందా భార్యను పక్కనబెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన రాఖీ ఆయన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ కోమల్ రాణి స్వర్ణకార్‌పై విరుచుకుపడింది.మీడియా సమక్షంలోనే రాఖీ సావంత్, గోవిందా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.`గోవిందా జీ, మీ చర్యల పట్ల దేశమంతా అసంతృప్తితో ఉంది.
మిమ్మల్ని పెళ్లాడి, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి, నలభై ఏళ్లుగా మీతో ఉన్న భార్యను ఎలా పక్కనబెడతారు? అంటూ ప్రశ్నించింది. నాలుగు పదుల బంధాన్ని పక్కనబెట్టి వేరొకరి వైపు చూడటం సరైంది కాదని హితవు పలికింది. అలాగే కోమల్ రాణి స్వర్ణకార్‌ను హెచ్చరిస్తూ రాఖీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోమల్‌ను పతి చోర్ (భర్తను దొంగిలిం చే వ్యక్తి) అని సంబోధించిన రాఖీ తనపై కానీ ఇతర సెలబ్రిటీలపై కానీ అసత్య ప్రచారాలు చేయవద్దని హెచ్చ రించింది. `నాతో పెట్టుకోకు. నేను సునీతను కాదు. నిన్ను చీల్చి చెండాడతాను` అని తీవ్రంగా మండిపడింది.
గతంలో రాఖీ సావంత్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో సునీత అహూజా సంచలన విషయాలు వెల్లడించింది. గోవిందా, కోమల్‌లు వివాహం చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారని సునీత ఆరోపించింది. అయితే రెండో పెళ్లి వార్తలను గోవిందా మేనేజర్ శశి సిన్హా పూర్తిగా ఖండించారు. తనపై వచ్చిన విమర్శలపై కోమల్ రాణి స్వర్ణకార్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. కెరీర్ ముగిసిపోయిన కొందరు నటీమణులు పబ్లిసిటీ కోసం ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని మండిపడింది. సొంత దాంపత్య జీవితాలను నిలబెట్టుకోలేని వారు తమకు సిందూరం, భారతీయ సంస్కృతి గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ధ్వజమెత్తింది.
లాల్‌బాగ్చా రాజా పండల్‌ను గోవిందా, కోమల్ కలిసి దర్శించుకోవడంతో ఈ వివాదం మరింత ఊపందుకుంది. అదే సమయంలో సునీత ఒంటరిగా వినాయకుడిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తమ మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన సంబంధమేనని, తాము కలిసి `రూప` అనే సినిమాలో నటిస్తున్నామని గోవిందా ఆరోపణలను ఖండించారు.
