మిల్కీ బ్యూటీపై ఐటమ్ క్వీన్ చిందులు
రాఖీ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు మిల్కీ బ్యూటీ అభిమానుల్లో అగ్గి రాజేసాయి. ఇటీవలే `పతి పత్నీ ఔర్ పంగా` అనే రియాలిటీ షోలో కనిపించింది.
By: Sivaji Kontham | 21 Oct 2025 3:00 AM ISTఈరోజుల్లో ఐటమ్ పాటల్లో నర్తించే వారిలో స్పార్క్, ఎనర్జీ రెండూ లేవని విమర్శించారు రాఖీ సావంత్. ఫిల్మీగ్యాన్ ఇంటర్వ్యూలో జెన్ జెడ్ ఐటమ్ భామలపై రాఖీ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తమన్నా భాటియా లేటెస్ట్ ఐటమ్ పాటను దృష్టిలో ఉంచుకుని రాఖీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
తాము మాత్రమే ఇండస్ట్రీకి ఒరిజినల్ ఐటెంగర్ల్ అని రాఖీ పేర్కొంది. తమన్నా లాంటి నటీమణులు ఇప్పుడు తన అడుగుజాడల్లో నడుస్తున్నారని రాఖీ కామెంట్ చేసారు. ఫిల్మిగ్యాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రస్తుత తరం ఐటెం సాంగ్స్ లో తాను ఒకప్పుడు తెరపైకి తెచ్చిన స్పార్క్ - ఎనర్జీ లేదని రాఖీ అన్నారు.
రాఖీ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు మిల్కీ బ్యూటీ అభిమానుల్లో అగ్గి రాజేసాయి. ఇటీవలే `పతి పత్నీ ఔర్ పంగా` అనే రియాలిటీ షోలో కనిపించింది. ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రంలోను తమన్నా మెరిసిపోయింది, అయితే రాఖీ వాదనలతో సంబంధం లేకుండా తమన్నా భాటియా వరుసగా డ్యాన్స్ నంబర్‌లతో స్క్రీన్‌ను మండిస్తోంది.
ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి వెబ్ చిత్రం `ది బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్` నుండి తాజా పాట `గఫూర్` వైరల్ సెన్సేషన్‌గా మారింది. ఈ పాటను తెరకెక్కించడంలో ఆర్యన్ ఖాన్ స్పష్ఠత- అర్థం చేసుకునే శక్తి గురించి తమన్నా ప్రశంసల వర్షం కురిపించింది. గఫూర్ పాట చాలా సరదాగా ఉంటుంది.. ఫరా ఖాన్ కొరియోగ్రఫీ తో ఇది మ్యాజికల్ గా మారింది. నేను ఈ పాటను ఒక రోజులోనే షూట్ చేయగలిగాను అని గుర్తు చేసుకున్నారు.
`స్త్రీ 2` లో `ఆజ్ కి రాత్` పాటతో ఒక ఊపు ఊపిన తమన్నా తదుపరి రజనీకాంత్ `జైలర్` నుంచి `కావాలా` పాటతోనే వైరల్ ఐటమ్ క్వీన్ గా మారింది. అలాగే అజయ్ దేవ్‌గన్‌తో కలిసి రైడ్ 2లో కనిపించింది. ఇటీవల డయానా పెంటీతో `డు యు వాన్నా పార్టనర్` అనే వెబ్ సిరీస్‌లో కనిపించిన తమన్నా ఇప్పుడు `వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్`లో నటిస్తోంది. ఇందులో మొదటిసారి సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తోంది. కేవలం ఐటమ్ భామగానే కాకుండా .. తనవైపు వచ్చిన చాలా అవకాశాలను ఓకే చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. యాక్షన్ అంటే చాలా ఇష్టం. నేను అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తానని కూడా తమన్నా తన ఆసక్తులను దర్శకులకు గుర్తు చేసింది.
