Begin typing your search above and press return to search.

హృతిక్ వల్లే క్రిష్ 4 ఆలస్యం.. కారణం చెప్పేసిన రాకేష్ రోషన్!

బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న క్రిష్ సిరీస్‌కు సంబంధించిన నాలుగో భాగం క్రిష్4 పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   8 Jun 2026 8:15 PM IST
హృతిక్ వల్లే క్రిష్ 4 ఆలస్యం.. కారణం చెప్పేసిన రాకేష్ రోషన్!
X

బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న క్రిష్ సిరీస్‌కు సంబంధించిన నాలుగో భాగం క్రిష్4 పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరో హృతిక్ రోషన్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 500 కోట్ల బడ్జెట్‌ను డిమాండ్ చేశారనే వార్తలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ప్రచారాలన్నింటికీ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ తాజాగా చెక్ పెట్టారు. అలాంటి కథనాల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేస్తూ, అది పూర్తిగా నాన్సెన్స్ అంటూ వాటిని కొట్టిపారేశారు.

దీంతో బడ్జెట్ కారణంగా సినిమా ఆగిపోయిందనే ప్రచారానికి కూడా తెరపడింది. క్రిష్4 పై వస్తున్న అనేక రూమర్ల మధ్య రాకేష్ రోషన్ ఇచ్చిన ఈ క్లారిటీ అభిమానులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ఇదే సమయంలో క్రిష్4 ఆలస్యంపై కూడా రాకేష్ రోషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ముందుకు సాగకపోవడానికి బడ్జెట్ సమస్యలు లేదా ఇతర అడ్డంకులు కారణం కాదని, హృతిక్ రోషన్ బిజీ షెడ్యూల్ ప్రధాన కారణమని వెల్లడించారు.

ప్రస్తుతం హృతిక్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులుండటంతో ఆయన డేట్స్ అందుబాటులోకి రావడం ఆలస్యం అవుతోందని తెలిపారు. దీంతో షూటింగ్ ప్రారంభానికి అనుకున్న దానికంటే ఎక్కువ టైమ్ పడుతోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో క్రిష్4 నిలిచిపోయిందా? లేక వాయిదా పడిందా? అనే సందేహాలకు కూడా సమాధానం లభించినట్టైంది.

ప్రాజెక్ట్ పూర్తిగా ట్రాక్‌లోనే ఉందని, సరైన సమయం వచ్చినప్పుడు మరిన్ని అధికారిక వివరాలు వెల్లడవుతాయని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ అప్డేట్ క్రిష్ అభిమానులకు మంచి ఊరటను ఇచ్చింది. గత కొంతకాలంగా సినిమా భవిష్యత్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా, రాకేష్ రోషన్ వ్యాఖ్యలు వాటికి ఫుల్ స్టాప్ పెట్టినట్టయ్యాయి.

ముఖ్యంగా బడ్జెట్ వివాదాలు, నిర్మాణ సమస్యలు, ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే ప్రచారాల మధ్య సినిమా కొనసాగుతోందని స్పష్టమైన సంకేతాలు రావడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. హృతిక్ రోషన్ ఈ ఫ్రాంచైజీని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు రాకేష్ రోష‌న్ క్లారిటీ ఇచ్చారు. అందుకే క్రిష్4పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం అధికారిక ప్రకటనల కంటే సోషల్ మీడియా రూమర్లే ఎక్కువగా హల్‌చల్ చేస్తున్నప్పటికీ, రాకేష్ రోషన్ తాజా వ్యాఖ్యలతో అసలు పరిస్థితి ఏంటో స్పష్టమైంది. దీంతో అభిమానులు ఇకపై బడ్జెట్ కథనాల కంటే సినిమా నుంచి వచ్చే నిజమైన అప్డేట్లపైనే దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.