రిసార్ట్‌ను తలపించేలా స్టార్ డైరెక్టర్ ఖండాలా విల్లా!
బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన సీనియర్ నటుడు, దర్శక-నిర్మాత రాకేష్ రోషన్ నివాసాల విషయంలోనూ రాయల్ స్టైల్‌ను పాటిస్తారు.
By: Srikanth Kontham | 8 Sept 2026 11:54 AM ISTబాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన సీనియర్ నటుడు, దర్శక-నిర్మాత రాకేష్ రోషన్ నివాసాల విషయంలోనూ రాయల్ స్టైల్‌ను పాటిస్తారు. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న నివాసంతో పాటు, మహా రాష్ట్రలోని హిల్ స్టేషన్ ఖండాలాలో ఎంతో ప్రశాంతమైన వాతావరణం నడుమ తాజాగా ఓ లగ్జరీ విల్లాను నిర్మించుకున్నారు. 120 కోట్ల అంచనా విలువ కలిగిన ఆస్తి కేవలం నివాసం మాత్రమే కాదు. అన్ని వసతులు ఉన్న రిసార్ట్‌ను తలపిస్తుంది.
ఈ విలాసవంతమైన విల్లాను రాకేష్ రోషన్ తన కుటుంబం మొత్తం కలిసి సమయం గడపడానికి.. అలాగే బిజీ లైఫ్ నుంచి విరామం తీసుకుని ప్రశాంతంగా గడపడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. కొండల మధ్య, పచ్చని ప్రకృతి ఒడిలో నిర్మించిన ప్రాపర్టీలో విశాలమైన గార్డెన్లు, ఆధునిక సౌకర్యాలు , అద్భుతమైన ఇంటీరియర్స్‌ను అమర్చారు. రోషన్ కుటుంబం తమ విహారయాత్రలు, పండుగలు , ప్రత్యేక వేడుకలను జరుపుకోవడానికి ఖండాలాలోని ఈ విల్లానే ప్రధాన వేదికగా నిలుస్తుంది.
ఈ భవనంలో ప్రధాన ఆకర్షణలలో ఒకటి ఓలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్. ప్రైవేట్ నివాసాలలో ఇంత పెద్ద సైజ్ పూల్ ఉండటం చాలా అరుదు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే రాకేష్ రోషన్ , ఆయన కుమారుడు హృతిక్ రోషన్ ఇద్దరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు పూల్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటారు. అంతేకాదు పూల్ చుట్టూ ఉన్న ఓపెన్ సిట్టింగ్ ఏరియా సాయంత్రం వేళల్లో కుటుంబ సభ్యులకు మంచి రిలాక్సేషన్ స్పేస్‌గా పని చేస్తుంది.
రోషన్ కుటుంబంలో హృతిక్ రోషన్, తన పిల్లలు హ్రేహాన్, హ్రిధాన్‌లతో కలిసి హాలిడే హోమ్‌లో గడిపేందుకు తరచూ వస్తుంటారు. రాకేష్ రోషన్ మనవళ్లతో సమయం గడపడానికి, ప్రకృతికి దగ్గరగా వారిని ఉంచడానికి ఈ ఖండాలా ప్రాపర్టీని ఎంతగానో ఇష్టపడతారు. ముంబై నగర సందడికి కొద్ది దూరంలో ఉన్న భవనం, కుటుంబ సమ్మేళనాలకు , మానసిక ప్రశాంతతకు సరైన వేదికగా మారింది.
భవనం లోపలి డిజైనింగ్ పరంగా క్లాసిక్, మోడ్రన్ కళారూపాల సమ్మేళనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ పరంగా నాణ్యమైన కలప, పెద్ద గ్లాస్ విండోస్ , సహజమైన వెలుతురు వచ్చేలా విల్లాను రూపొందించారు. జిమ్, ప్రైవేట్ థియేటర్, పార్టీ డెక్ వంటి సమస్త సౌకర్యాలు ఈ నివాసంలో అందుబాటులో ఉన్నాయి. రాకేష్ రోషన్ పరిశ్రమలో దశాబ్దాల పాటు సాధించిన సక్సెస్, ఆయన అభిరుచులకు ఈ నివాసం నిదర్శనంగా నిలుస్తుంది.
రాకేష్ సినీ ప్రయాణంలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో నిర్మించుకున్న లగ్జరీ విల్లా, బాలీవుడ్ సెలబ్రిటీల అత్యంత ఖరీదైన ప్రాపర్టీలలో ఒకటిగా నిలిచింది. ఒక దర్శకుడిగా రాకేష్ రోషన్ విజన్ ఎంత గొప్పదో, తన వ్యక్తిగత జీవితంలో జీవనశైలిని, వాతావరణాన్ని ఎంచుకోవడంలో ఆయన అభిరుచి అంతకంటే ఉన్నతంగా ఉంటుందని ఈ ఖండాలా డ్రీమ్ హోమ్ నిరూపిస్తోంది.
