Begin typing your search above and press return to search.

థ్రిల్ ను స్పాయిల్ చేయొద్దు

ఈ సినిమాలో ర‌ణ్‌వీర్ సింగ్ భారతీయ గూఢచారి హమ్జా/జస్కిరత్ పాత్రలో నటించి కథను ముందుకు నడిపిస్తాడు.

By:  Sravani Lakshmi Srungarapu   |   23 March 2026 9:00 PM IST
థ్రిల్ ను స్పాయిల్ చేయొద్దు
X

బాలీవుడ్‌లో తాజాగా రిలీజైన దురంధ‌ర్: ది రివెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తూ, కేవలం కలెక్షన్ల పరంగా మాత్రమే కాకుండా కంటెంట్ పరంగానూ చర్చనీయాంశంగా మారింది. ఆదిత్య‌ధ‌ర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్-పాలిటికల్ థ్రిల్లర్ మార్చి 19న విడుదలై, కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫీట్‌తో, దురంధ‌ర్2, పుష్ప‌2 తర్వాత అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ సినిమాలో ర‌ణ్‌వీర్ సింగ్ భారతీయ గూఢచారి హమ్జా/జస్కిరత్ పాత్రలో నటించి కథను ముందుకు నడిపిస్తాడు. కరాచీ లోని ల్యారి అండర్‌వర్ల్డ్‌లో చొరబడిన అతని పాత్ర, వివిధ మిత్రుల సహాయంతో రాజకీయ మరియు సామాజిక మార్పులకు దారి తీసే విధంగా డిజైన్ చేయబడింది. స్టోరీలో పొలిటిక‌ల్ డ్రామా, యాక్షన్, ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్స్ అన్నీ సమతూకంగా మిళితమై ఉండటం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఈ నేపధ్యంలో, దురంధ‌ర్2 సోషల్ మీడియా ట్రెండ్‌గా మారుతున్న సమయంలో ఒక కీలక అంశం కూడా ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ప్రముఖ నటుడు రాకేష్ బేడీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ధురంధ‌ర్2లో భాగ‌మైనందుకు సంతోషంగా ఉంద‌ని చెప్పిన ఆయ‌న‌, సినిమా చూస్తున్నప్పుడు ముఖ్యమైన సన్నివేశాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని ఆయన కోరారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లీక్ కావడం వల్ల ఇతర ప్రేక్షకుల అనుభవం దెబ్బతింటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో థియేటర్ అనుభవాన్ని సోషల్ మీడియా ఎలా ప్రభావితం చేస్తోందన్న దానిపై ఈ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

డైరెక్ట‌ర్ ఆదిత్య ధర్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించిన తీరు ఆడియ‌న్స్ నుంచి ప్రశంసలు అందుకుంటుండ‌గా, యాక్షన్ సీక్వెన్స్‌లు, పొలిటికల్ నేరేషన్, ఇంటర్నేష‌న‌ల్ లెవెల్ ట్రీట్‌మెంట్ అన్నీ క‌లిపిచేసి ఈ సినిమాను పాన్-ఇండియా నుంచి గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాయి. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను అందుకోవడం విశేషం.