50 లక్షల నటుడికి కోటిరన్నరతో ప్రమోషన్!
ఇటీవలే రిలీజ్ అయిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్`2 ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. సినిమాలో ప్రతీ పాత్ర అద్బుతంగా పండింది.
By: Srikanth Kontham | 24 April 2026 7:00 PM ISTఇటీవలే రిలీజ్ అయిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్`2 ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. సినిమాలో ప్రతీ పాత్ర అద్బుతంగా పండింది. నటీనటుల ప్రతిభను వాడుకోవడంలో దర్శకుడు అదిత్య ధర్ పనితనం ప్రశంసనీయం. ముఖ్యంగా సినిమాలో జమీల్ జమాలీ అనే పాకిస్థానీ రాజకీయ నాయకుడి పాత్రలో సీనియర్ నటుడు రాకేశ్ బేడీ అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ పాత్రకు వచ్చిన ఆదరణను చూసి ఫిదా అయిన చిత్ర నిర్మాతలు ఊహించని రీతిలో కోటి రూపాయల బోనస్‌ను అందించినట్లు సమాచారం.
సాధారణంగా సినిమాల్లో హీరోలకు లేదా దర్శకులకు భారీ రెమ్యునరేషన్లు , లాభాల్లో వాటాలు దక్కడం సహజం. కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఇంత పెద్ద మొత్తంలో బోనస్ లభించడం పరిశ్రమలో అరుదైన విషయంగా చెప్పొచ్చు.
రాకేశ్ బేడీ ఈ ఫ్రాంచైజీలోని రెండు భాగాలకు (ధురంధర్) కలిపి 50 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే సినిమా సాధించిన అసాధారణ విజయం , ఆయన పాత్రకు దక్కిన గుర్తింపును గౌరవిస్తూ దర్శక, నిర్మాతలు ఆయనకు ప్రత్యేక కానుకను కోటి అందించారు. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ పలికించిన డైలాగులు ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా సెకెండ్ పార్ట్‌లో ఆయన పాత్ర చుట్టూ తిరిగే ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. 45 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం ఉన్న రాకేశ్ బేడీకి ఈ వయసులో ఇలాంటి గుర్తింపు రావడం నిర్మాతలు ఆయన కష్టాన్ని గుర్తించి అదనపు పారితోషికం ఇవ్వడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతిభను గౌరవించే విషయంలో ధురంధర్ నిర్మాతలు కొత్త ఒరవడిని సృష్టించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బోనస్ వార్తలపై రాకేశ్ బేడీ తనదైన శైలిలో చమత్కరించారు .
`అసలు ఆ డబ్బు ఎక్కడ ఉంది? ఎవరి దగ్గర ఉంది? నాకు అస్సలు తెలియదు` అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఆ డబ్బు ఉంటే తనకు ఇవ్వాలని జోక్ చేశారు. ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించనప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం నిర్మాతలు ఆయనకు ఈ మొత్తాన్ని చెక్ రూపంలో అందజేసినట్లు సమాచారం. ఈ విజయంతో రాకేష్ బేడీకి బాలీవుడ్ లో కొత్త అవకాశాలు క్య కడుతున్నాయి. ఆయన నటనా శైలిని ఎలా వినియోగించుకోగల్గితే సినిమాకు కలిసొస్తుందో? దర్శకులు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త ప్రాతలు రాస్తున్నట్లు సమాచారం. ఇలాంటి ప్రతిభావంతుడని తెలుగు మేకర్స్ కూడా అవకాశాలు కల్పిచే ఛాన్స్ ఉంది.
