'రాకాస' టీజర్ : ఓ స్త్రీ రేపు రా.. ఈరోజే తడిసిపోయిందిగా!
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ `పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్` పై నిర్మిస్తున్న తాజా చిత్రం `రాకాస` టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
By: Sivaji Kontham | 1 March 2026 9:36 PM ISTమెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ `పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్` పై నిర్మిస్తున్న తాజా చిత్రం `రాకాస` టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. గ్రిప్పింగ్ మూవీ టీజర్ రక్తి కట్టిస్తోంది. కథానాయకుడిలోని ఈజ్ కామెడీ సెన్స్ తో పాటు, థ్రిల్లింగ్ హారర్ ఎలిమెంట్స్ గగుర్పాటుకు గురి చేస్తున్నాయి..ఇతర హారర్ సినిమాల తరహాలోనే ఒక పాడుబడిన బూత్ బంగ్లా లేదా పాత కోటలోకి వెళ్లాక పరిణామాలు భయోత్పాతం సృష్టిస్తున్నాయి.
ముఖ్యంగా ఇందులో నటించిన కథానాయకుడి పాత్ర ఆసక్తికరం. `ఓ స్త్రీ రేపు రా..` అంటూ టీజర్ చివరిలో ట్విస్ట్ ఊహించని గగుర్పాటు. ఆ స్త్రీ రేపు వస్తుందో లేదో కానీ ఈరోజే తడిసిపోతుంది..! అనేంతగా టీజర్ రక్తి కట్టించింది. ఇందులో ఆసక్తికరమైన డైలాగ్స్ , విజువల్స్ చూస్తుంటే, ఈ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తోంది. గ్రిప్పింగ్‌గా సాగుతున్న ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఈ సినిమాలో కథానాయకుడు సంగీత్ శోభన్ తనదైన ఈజ్, కామెడీ సెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా `మిస్టర్ వీరు ఫ్రమ్ ది యుఎస్ ఏ` అంటూ ఆయన పండించిన వినోదం ఒకవైపు నవ్వులు పూయిస్తుంటే, మరోవైపు గగుర్పాటుకు గురిచేసే హారర్ ఎలిమెంట్స్ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. సాధారణ హారర్ సినిమాల తరహాలోనే ఒక పాడుబడిన బూత్ బంగ్లా లేదా పాత కోటలోకి ప్రవేశించిన తర్వాత ఎదురయ్యే పరిణామాలు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ఈ చిత్రంలోని `వీరు` పాత్ర చుట్టూ అల్లిన కథనం చాలా ఆసక్తికరంగా మలినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ భన్సాల్‌తో కలిసి జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మించిన ఈ చిత్రం టెక్నికల్ వాల్యూస్ పరంగా చాలా గ్రాండ్‌గా కనిపిస్తోంది. మానస శర్మ దర్శకత్వ ప్రతిభ, అనుదీప్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం హారర్ మూడ్‌ని పర్‌ఫెక్ట్‌గా సెట్ చేశాయి. ఏప్రిల్ 3 విడుదల కాబోతున్న ఈ సినిమా.. వేసవి సెలవుల్లో బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
నటీనటుల విషయానికి వస్తే, సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక నటిస్తుండగా, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతటి భారీ స్టార్ కాస్టింగ్ ఉండటం సినిమాకు మరో పెద్ద ఎసెట్.
మొత్తానికి, ఒక పక్కా ఎంటర్టైనింగ్ రైడ్‌గా రానున్న `రాకాస` ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని, భయాన్ని సమాన పాళ్లలో అందించేలా కనిపిస్తోంది. ఏప్రిల్ లో `రాకాస` సృష్టించే హంగామా చూడటానికి మెగా అభిమానులు, సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
