'రాకాసా' ఫస్ట్ సింగిల్.. మొత్తం క్రేజీగా ఉందే!
లిరిక్స్ బీట్ కు సరిపోయేలా సాగుతూ క్రేజీ లిరికల్ రిథమ్ ను క్రియేట్ చేస్తున్నాయి. సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ ఇచ్చిన ట్యూన్ పాటకు మరింత ఉత్సాహాన్ని తెచ్చింది.
By: M Prashanth | 7 March 2026 10:16 PM ISTమ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్ లీడ్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం రాకాసా. ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుండగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సమ్మర్ కానుకగా ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా సినిమా రిలీజ్ కానుండగా.. మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తొలి సింగిల్ రిలీజ్ చేశారు.
శనివారం నాడు రాకాసా మూవీలోని రపప్పా సాంగ్ ను విడుదల చేయగా.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఎంటర్టైన్మెంట్ మోడ్ లో రూపొందిన ఆ పాట సినిమాకు సంబంధించిన మ్యూజికల్ మూడ్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. లవ్ ఫెయిల్ అయిన తర్వాత వచ్చే బాధకు ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి ఆ పాటను రూపొందించారు. లిరిసిస్ట్ రఘురామ్ ఫన్నీ వర్డ్స్ తో, పంచ్ లతో స్పెషల్ టచ్ ఇచ్చారు.
లిరిక్స్ బీట్ కు సరిపోయేలా సాగుతూ క్రేజీ లిరికల్ రిథమ్ ను క్రియేట్ చేస్తున్నాయి. సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ ఇచ్చిన ట్యూన్ పాటకు మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. ఎనర్జీతో నిండిన మ్యూజిక్.. సాంగ్ ను క్యాచీగా మార్చింది. సింగర్ రామ్ మిరియాల తన గాత్రంతో పాటకు వ్యంగ్యం, బాధ, సరదా ఫీలింగ్స్ ను కలిపి వినిపించారు. ఆయన వాయిస్ సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
రపప్పా పాటకు జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సాంగ్ లోని సరదా టోన్ కు తగ్గట్టుగా డ్యాన్స్ స్టెప్స్ ను రూపొందించి విజువల్ గా ఆకట్టుకునేలా చేశారు. దీంతో పాట వినడానికి మాత్రమే కాకుండా చూడటానికి కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాకాసా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. టైటిల్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ రాగా.. ఇప్పటివరకు సుమారు 1.9 మిలియన్ వ్యూస్ దాటింది.
అలాగే ఇటీవల విడుదలైన టీజర్ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సాధించింది. కేవలం ఐదు రోజుల్లోనే అది 2.7 మిలియన్ వ్యూస్ ను దాటింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఫాంటసీ, సూపర్ నేచురల్ అడ్వెంచర్ అంశాలతో పాటు కామెడీని కలిపి రూపొందించిన ఆ సినిమా ప్రత్యేకంగా ఉండనుందని అర్థమవుతోంది. మరి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా సినిమా రిలీజ్ కానుండగా.. ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
