నిహారిక 'రాకాసా'.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
సమ్మర్ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సిద్ధమవుతోంది.
By: M Prashanth | 6 March 2026 3:53 PM ISTటాలీవుడ్ లో తనదైన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్ ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన ఆయన, ఈసారి హారర్ కామెడీ ఎంటర్టైనర్ రాకాసా మూవీతో థియేటర్లలోకి రాబోతున్నారు. మానస శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు.
సమ్మర్ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సిద్ధమవుతోంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పుడు మరో అప్డేట్ ను మేకర్స్ వెల్లడించారు. చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు స్పెషల్ వీడియో ద్వారా తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించారు.
మార్చి 7న రాకాస చిత్రంలోని తొలి పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. రాకాసా ప్రపంచం నుంచి వస్తున్న హార్ట్ బ్రేక్ సాంగ్ మీ ప్లే లిస్ట్ లో చోటు సంపాదించేందుకు సిద్ధమైందని చెప్పారు. మార్చి 7న Rapappa తో మీ హృదయాలను కదిలించేందుకు, అలాగే డ్యాన్స్ చేయించే మ్యూజిక్ తో రావడానికి సిద్ధంగా ఉండండంటూ మేకర్స్ పోస్టు చేశారు.
అయితే ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ కోసం విడుదల చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సంగీత్ శోభన్ తన గదిలో ఉండగా బయట నుంచి పలువురు పిలుస్తుంటారు. అప్పుడే గెటప్ శ్రీను లోపలికి వచ్చి "ఏంటి బావా… కొంగను చూస్తున్నావా?" అని సరదాగా అడుగుతాడు. దానికి సంగీత్ శోభన్ "అది ఇన్ స్టా లో ఫేమస్ అయిన పెంగ్విన్ బావా… ఆ పెంగ్విన్ నేనే బావ" అంటూ వీడియో చూపిస్తాడు.
"చూడు ఎలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిపోతుందో" అంటూ తన పరిస్థితిని సరదాగా చెప్పుకుంటాడు. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఎలిమెంట్స్ ఎలా మారిపోయాయో గెటప్ శ్రీను చెప్పే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఆ తర్వాత "నీ బాధ ఏంటి బావా?" అని అడిగితే "నా బాధ మర్చిపోయావా? నా హార్ట్ బ్రేక్ బాధను ఆడియన్స్ కు అంటించేద్దాం అనుకుంటున్నా" అంటూ సంగీత్ శోభన్ చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంటుంది.
ఇక వాలెంటైన్స్ డే ఇటీవలే ముగిసిందని గుర్తు చేస్తూ, దానికి సరిపోయేలా ఒక హార్ట్ బ్రేక్ సాంగ్ ను ప్లాన్ చేశానని సంగీత్ శోభన్ చెబుతాడు. "ఇప్పుడు ఈ పాటను రిలీజ్ చేస్తే సింగిల్స్, లవర్స్ తట్టుకోలేరు బావా"అంటూ గెటప్ శ్రీను చెప్పే డైలాగ్ వీడియోలో హైలైట్ గా నిలుస్తోంది. చివరలో హార్ట్ బ్రేక్ యాంథమ్ తో అందరినీ ఏడిపించేస్తా అంటూ సంగీత్ శోభన్ చెబుతూ సినిమా విడుదల తేదీని మరోసారి గుర్తుచేస్తారు. మరి మార్చి 7న విడుదల కానున్న రాకాసా ఫస్ట్ సింగిల్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.
