'రాకాస'.. మూడు రోజుల్లోనే రికార్డ్ వసూళ్లు!
ఫైనల్ గా ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద ఒక సేఫ్ ప్రాజెక్టుగా నిలిచింది. మూడు రోజుల్లోనే 15 కోట్ల మార్కును దాటేయడం అంటే అది ఒక మంచి విజయంగానే ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
By: M Prashanth | 7 April 2026 9:45 AM ISTవేసవి సెలవుల నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాలు కూడా సందడి చేస్తున్నాయి. నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ‘రాకాస’ చిత్రం ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఒక మంచి ఛాయిస్‌గా మారింది. క్లీన్ కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి ఆశించిన దానికంటే మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా పిల్లలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద బాగానే వర్కవుట్ అవుతోంది. కథలోని ఫాంటసీ అంశాలు పిల్లలను ఆకట్టుకుంటుంటే, కామెడీ సీక్వెన్స్‌లు పెద్దలను నవ్విస్తున్నాయి.
సినిమాలోని పాత్రల గురించి చెప్పాలంటే, సంగీత్ శోభన్ గెటప్ శ్రీను మధ్య సాగే ట్రాక్ సినిమాకు ప్రధాన బలంగా మారింది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ హైలెట్ అవుతున్నాయి. అలాగే వెన్నెల కిషోర్ తన మార్క్ టైమింగ్‌తో మరోసారి మెప్పించారు. ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం మొత్తం కలిసి చూసేలా దర్శకుడు ఈ కథను మలిచిన తీరు సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. విదేశాల్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం వైపు మొగ్గు చూపుతుండటం విశేషం.
ఇక బాక్సాఫీస్ వద్ద ‘రాకాస’ వసూళ్లలో తన జోరును కొనసాగిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 15.80 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చి, మొదటి వీకెండ్‌లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. నార్త్ అమెరికాలో అప్పుడే 250K డాలర్ల మార్కును దాటి, మరిన్ని వసూళ్లు అందుకునే దిశగా దూసుకుపోతోంది.
మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ లెక్కల ప్రకారం, ఈ సమ్మర్ లో ఒక మాన్‌స్ట్రస్ వీకెండ్ ను సినిమా ఎంజాయ్ చేస్తోంది. మొదటి రోజు నుంచి వసూళ్లు నిలకడగా ఉండటమే కాకుండా, సెలవుల వల్ల ఆదివారం నాడు రికార్డ్ స్థాయి బుకింగ్స్ నమోదయ్యాయి. ఒక కొత్త తరహా ఫాంటసీ డ్రామాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న తీరు బాక్సాఫీస్ నెంబర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టేలా ఉంది.
సమ్మర్ లో పిల్లలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉండటం వల్ల వీక్ డేస్ లో కూడా కలెక్షన్లు నిలకడగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఎండలు, ఐపీఎల్ హడావుడి టైమ్ లో ఇలాంటి చిన్న చిత్రాలు నిలదొక్కుకోవడం కష్టమనే అభిప్రాయం ఉంటుంది. కానీ ‘రాకాస’ విషయంలో అది రివర్స్ అయింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని ఈ ఫలితం నిరూపిస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఈ వసూళ్ల పెరుగుదలకు తోడైంది.
ఫైనల్ గా ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద ఒక సేఫ్ ప్రాజెక్టుగా నిలిచింది. మూడు రోజుల్లోనే 15 కోట్ల మార్కును దాటేయడం అంటే అది ఒక మంచి విజయంగానే ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ ఇంకా ఉండటంతో ఫుల్ రన్ లో ఈ సినిమా మరిన్ని కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా కిడ్స్ ను కూడా థియేటర్లకు రప్పిస్తున్న ఈ ‘రాకాస’ రేపు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
