Begin typing your search above and press return to search.

రియ‌ల్ స్టోరీని రియ‌లిస్టిక్‌గా తీయ‌డం ఛాలెంజింగ్: శివాజీ

''రియ‌ల్ క‌థ‌లు రియ‌లిస్టిక్ గా తీయ‌డం నిజంగా ఛాలెంజింగ్.. ప‌ల్లెటూళ్ల‌లో నేటి జ‌న‌రేష‌న్ ఎలా ఉందో చూస్తున్నాం.

By:  Sivaji Kontham   |   20 Nov 2025 11:30 AM IST
రియ‌ల్ స్టోరీని రియ‌లిస్టిక్‌గా తీయ‌డం ఛాలెంజింగ్: శివాజీ
X

''రియ‌ల్ క‌థ‌లు రియ‌లిస్టిక్ గా తీయ‌డం నిజంగా ఛాలెంజింగ్.. ప‌ల్లెటూళ్ల‌లో నేటి జ‌న‌రేష‌న్ ఎలా ఉందో చూస్తున్నాం. ఆటో అబ్బాయి.. ఎంప్లాయ్ కూతురు.. ప్రేమికులిద్ద‌రినీ ఎంక‌రేజ్ చేసే స్నేహితులు.. ప్ర‌తి ఊళ్లో ఉంటారు. ఇదే నిజ క‌థ‌ను తెర‌పై చూపించారు. ఈటీవీ విన్ ప్ర‌య‌త్నం ఛాలెంజింగ్ గా ఉంది'' అని అన్నారు హీరో శివాజీ.

ఈటీవీ విన్ నిర్మించిన `రాజు వెడ్స్ రాంబాయి` మూవీ ప్ర‌మోష‌న్స్ లో శివాజీ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ-``ద‌ర్శ‌కుడు ఏం చెప్పాల‌నుకున్నారో ఆ పాయింట్‌ను చాలా బ‌లంగా చెప్పారు. అయినా కొంద‌రికి కొన్ని డౌట్లు ఉన్నాయి.. ఇలా ఉంటుంది.. అలా ఉంటుది అని సందేహాలున్నాయి.. కానీ క‌థ‌ను న‌మ్మి నిజాయితీగా తెర‌కెక్కిస్తే ఏ సినిమా కూడా మోసం చేయ‌దు. ఒక్కోసారి సినిమాలు చూడ‌గానే ఓకే చూడొచ్చులే.. క్లైమాక్స్ కొంచెం బావుంటే...అంటూ న‌సుగుతారు. కానీ నిజ‌మైన‌ ఆడియెన్ చూస్తే వ‌చ్చే స్పంద‌న వేరు.. అలాంటి స్పంద‌న‌ను రాజు వెడ్స్ రాంబాయి అందుకుంటుంది`` అని అన్నారు.

శివాజీ ఇంకా మాట్లాడుతూ -ఇలాంటి క‌థ‌లు మ‌ల‌యాళంలో చేస్తే 300 రోజులు ఆడ‌తాయి. ఇప్పుడిప్పుడు తెలుగులోను కూడా ఆడియెన్ మారారు. ఇక్క‌డా ఆద‌రిస్తారు. శాడ్ ఎండింగ్ లేని క‌థ ఇది. రూర‌ల్ లో మ‌నుషుల ఆలోచ‌న‌ల‌కు ద‌గ్గ‌ర‌గా తీసుకుని వెళ్లాడు ద‌ర్శ‌కుడు. మ‌రీ రియ‌ల్ గా తీసాడు. ఇలాంటి క‌థ‌ను తెర‌కెక్కించాలంటే గ‌ట్స్ ఉండాలి. ఈ క‌థను ఒప్పుకోవ‌డానికి ఆర్టిస్టుల‌కు గ‌ట్స్ ఉండాలి. అంద‌రినీ న‌మ్మి ఈటీవీ యాజమాన్యం తీసిన సినిమా ఇది. నేను చూసాను.. నాకైతే న‌చ్చింది. అంద‌రూ చూడండి`` అని అన్నారు. సురేష్ బొబ్బిలి పాట‌లు బావున్నాయి. మెలోడి బావుది. హీరో హీరోయిన్ బాగా న‌టించారు. ఇత‌ర ఆర్టిస్టుల న‌ట‌న బావుంది. అనితా చౌద‌రి గారు, వారి భ‌ర్త పెర్ఫామెన్స్ అద‌ర‌గొట్టారు.. అని తెలిపారు.

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వంశీ నందిపాటి, బన్నీ వాస్ లు తమ బ్యానర్‌ల ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సాయిలు కంపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వరంగల్, ఖమ్మం జిల్లాల మధ్య జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది.