పబ్లిసిటీ స్టంట్ అన్న వాళ్లే పొగుడుతున్నారు
వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ గా రిలీజ్ చేసిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా..
By: Sravani Lakshmi Srungarapu | 22 Nov 2025 9:21 AM ISTమా సినిమాను మనసు పెట్టి తీశాం, ఆడియన్స్ కు తప్పక నచ్చుతుంది. ఓ ఊరిలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగానే ఈ సినిమాను తీశాం, ఈ సినిమా చూశాక సమాజంలో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అనిపిస్తుందని తమ సినిమా గురించి చిత్ర యూనిట్ మొత్తం మొదటి నుంచి గొప్పగా చెప్పుకున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. అఖిల్ రాజ్, తేజస్విని హీరోహీరోయిన్లుగా సాయిలు కంపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ గా రిలీజ్ చేసిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా..
ఈటీవీ విన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్ మాట్లాడుతూ "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా వెనక తమ రెండేళ్ల కష్టం ఉందని, ఇవాళ ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఆడియన్స్ ఇచ్చారని, మా డైరెక్టర్ సాయిలు ఈ ప్రేమ కథను ఎంతో నిజాయితీగా తెరపైకి తీసుకొచ్చారన్నారు.
రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఇంటెన్స్ లవ్‌స్టోరీ
చిత్ర సమర్పకులు డా.నాగేశ్వరరావు పూజారి మాట్లాడుతూ మా చిత్రాన్ని ఆడియన్స్ గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ జెనరేషన్ లోని ప్రతి ప్రేమ జంట చూడాల్సిన చిత్రమిది. ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా ఇది. థియేటర్స్ లో ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మా సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే ఈ మూవీ రిజల్ట్ గురించి చెప్పాను. ఇటీవల కాలంలో వచ్చిన ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇదే అన్నారు.
డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ - మా మూవీ సక్సెస్ తో మాటలు రావడం లేదు. నాకు ఈ వేదికను, ఈ సక్సెస్ ను ఇచ్చిన క్రెడిట్ ఈటీవీ విన్ సాయి, నితిన్ గారిదే. ఈ జర్నీలో నాకు బ్రదర్ లా సపోర్ట్ ఇచ్చారు. వారి తపన అంతా సినిమా కోసమే. సినిమా మీద ప్యాషన్ ఉన్న ఇలాంటి వాళ్లు ఉంటే ఎంతోమంది కొత్త వాళ్ల జీవితాలు బాగుపడతాయి. అమీర్ పేట చౌరస్తాలో బ్యాండ్ కొడతా. మీడియా మిత్రులకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదని, ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ రాంబాయి పాట హిట్ అయినప్పుడు సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నా. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే టెక్నీషియన్ కు రెండు మూడేళ్లు కెరీర్ లైఫ్ పెరుగుతుంది. ఈ సినిమాను సక్సెస్ చేసిన ఆడియన్స్ కు కృతజ్ఞతలు అన్నారు.
ఎడిటర్ నరేష్ అడుపా మాట్లాడుతూ మా సినిమాను చూసి ఆదరిస్తున్న వారికి థ్యాంక్స్. ఇంకా చూడని వారు ఉంటే చూడమని కోరుతున్నా. మా యూనిట్ మెంబర్స్ అంతా ప్రేమించి చేసిన సినిమా ఇది. ఇందులో మా అందరి హార్డ్ వర్క్ ఉంది. కష్టపడి చేసిన మంచి సినిమాకు ఆదరణ ఉంటుందని మరోసారి ప్రూవ్ అయ్యిందన్నారు.
ఆ మాట ఈరోజు నిజమైంది
యాక్టర్ చైతన్య జొన్నలగడ్డ మాట్లాడుతూ మార్నింగ్ నుంచి మా మూవీ టాక్ తెలుసుకుంటూనే ఉన్నా. సినిమా సూపర్ హిట్ అని మా వాళ్లు చెప్పినా మళ్లీ మళ్లీ అడిగి కన్ఫర్మ్ చేసుకున్నా. నేను చేసిన వెంకన్న పాత్రకు ప్రేక్షకులు బాగా రెస్పాండ్ అవుతున్నారు. నన్ను ద్వేషిస్తున్నారు. రిలీజ్ ముందే మా వాసు గారు ఈ సినిమా నీ కెరీర్ లో గుర్తుండిపోతుందని చెప్పిన మాట ఈ రోజు నిజమైందన్నారు.
ప్రొడ్యూసర్ రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ ఈ స్టోరీ థియేటర్స్ లో ప్రేక్షకులకు నచ్చుతుంది అని మేము పెట్టుకున్న నమ్మకం నిజమైంది. అందుకు ఆడియన్స్ తో పాటు మాకు సపోర్ట్ గా నిలిచిన మీడియా మిత్రులకు థ్యాంక్స్ అన్నారు.
ఫ్రెండ్ కాల్ చేసి ఆనందంతో కన్నీళ్లొచ్చాయంది
హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాలోని ప్రతి ఎమోషన్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఎమోషన్ కు గురవుతున్నారు. లవ్ ను ఫీల్ అవుతున్నారు. మా స్నేహితురాలు ఫోన్ చేసి ఈ సినిమా చూశాక ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని చెప్పింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ మా సినిమా విజయానికి నిదర్శనం. మేము వెళ్లిన ప్రతి థియేటర్ లోనూ ఆడియెన్స్ సందడి కనిపిస్తోంది. అన్నారు.
మా సక్సెస్ కు ఇదే ప్రూఫ్
హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ నేను పడిన పదేళ్ల కష్టం ఈ సినిమాతో దక్కింది. ఉదయం నుంచి ఎమోషనల్ గా ఉన్నాను. బుక్ మై షో లో గంటకు 2 వేల టికెట్స్ బుక్ అవుతున్నాయి. మా సినిమా సక్సెస్ కు ఇదే ప్రూఫ్. థియేటర్స్ లోకి వెళ్లి చూస్తే ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇన్నేళ్లు కోరుకున్నది, చూడాలనుకున్నది ఇదే అనిపించింది. మీ దగ్గరకు మేమంతా వస్తాం, ప్రతి ప్రాంతంలోని థియేటర్స్ కు వచ్చి ప్రేక్షకుల్ని పలకరిస్తామన్నారు.
మొదటి నుంచి చెప్పిందే జరిగింది
ప్రొడ్యూసర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా చివరి 30 నిమిషాలు హార్డ్ హిట్టింగ్ గా ఉంటుందని మేము ప్రమోషన్ లో చెబితే అది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అన్నారు. అలా అన్న వారే ఇప్పుడు మంచి సినిమా అని అంటున్నారు. మేము ఓడిపోయేందుకు కూడా రెడీ గానీ దిగజారి మాట్లాడము. మా సినిమా ఎమోషనల్ గా ఉంది, మైండ్ బ్లోయింగ్ గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. రివ్యూస్ పాజిటివ్ గా వస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని ట్రేడ్ వాళ్లు చెబుతున్నారు. చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఈటీవీ విన్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అన్నారు.
ఈటీవీ విన్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ రాజు వెడ్స్ రాంబాయి ప్రాజెక్ట్ మా దగ్గరకు వచ్చినప్పటి కంటే ఆ సినిమాకు సురేష్ బొబ్బిలి చేసిన సాంగ్స్ విన్నప్పుడే ఎక్కువ ఎగ్జైట్ అయ్యాం. ఈ సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయాలని సురేష్ బొబ్బిలి సాంగ్స్ విన్నప్పుడు ఫిక్స్ అయ్యాం. ఈ సినిమాను థియేట్రికల్ గా తీసుకురావాలని గట్టిగా నమ్మిన వ్యక్తి బాపినీడు గారు. తక్కువ టికెట్ రేట్స్ పెట్టడం కూడా మా మూవీకి కలిసొచ్చిందన్నారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ ఊరోడు సినిమా ఏం చేస్తాడు అని అన్న వాళ్లకు ఈ రోజు థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ సమాధానం ఇస్తోంది. ఈ రోజు నుంచి మా మూవీ బ్యాండ్ కొట్టడం మొదలైంది. మా మూవీకి వర్క్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్ అన్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ - ఏ సినిమా రిలీజైనా థియేటర్స్ దగ్గర రెస్పాన్స్ తెలుసుకుంటాను. "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాకు కూడా అలా వెళ్లి చూశాను. ప్రతి ఒక్కరూ కథకు రిలేట్ అవుతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. ప్రేక్షకులు ఇస్తున్న ఆదరణ, ప్రేమే మాకు ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు చేసే ఎనర్జీని, సపోర్ట్ ను అందిస్తోంది. ఈ సినిమాను ఫస్ట్ నమ్మిన బాపినీడు గారికి థ్యాంక్స్ అన్నారు.
కంటెంట్ ను జడ్జ్ చేయడంలో మరోసారి సక్సెస్ అయ్యా
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ - "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటున్నారు. ప్రేమలో ఉన్న అమ్మాయి, అబ్బాయి, ఆ ప్రేమను వద్దనే తండ్రి ప్రతి ఒక్కరూ ఈ కథకు కనెక్ట్ అవుతున్నారు. ఊరి నుంచి వచ్చిన డైరెక్టర్ సాయిలు తనలోని నిజాయితీ, ఆ ఫ్యూరిటీతో సినిమా రూపొందించాడు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లింది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో ఈటీవీ విన్ వారు మరోసారి సక్సెస్ అయ్యారు. ఈ సినిమా సక్సెస్ ను ఫస్ట్ ఎంజాయ్ చేయాల్సింది మూవీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్. ఇలాంటి మంచి చిత్రాన్ని థియేట్రికల్ గా ప్రేక్షకుల దగ్గరకు వీలైనంత బాగా చేరువ చేయడానికే ప్రయత్నించాం. ఈ సినిమాలో హీరోయిన్ ను తండ్రి కొట్టే సీన్ ను చూసి కొందరు బాధపడ్డారు. నేనూ బాధపడ్డా. అయితే ఆ తండ్రి కూతురుని దండించడంలోనూ ప్రేమే ఉంది. హీరో హీరోయిన్లు అఖిల్, తేజస్వినీ బాగా పర్ ఫార్మ్ చేశారు. చైతన్య వెంకన్న రోల్ లో ఆకట్టుకున్నాడు. సినిమా కంటెంట్ ను జడ్జ్ చేయడంలో మేమంతా మరోసారి సక్సెస్ అయ్యాం. అన్నారు.
