Begin typing your search above and press return to search.

రాజు వెడ్స్ రాంబాయి.. ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే..

పూర్తిగా కొత్త నటీనటులు నటించిన ఈ చిత్రం, తొలి రోజునే సాలిడ్ ఎంట్రీ ఇచ్చి, ఇతర నోటెడ్ హీరోల సినిమాలకు గట్టి పోటీనిచ్చింది.

By:  M Prashanth   |   22 Nov 2025 3:42 PM IST
రాజు వెడ్స్ రాంబాయి.. ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే..
X

ఈ వారం థియేటర్లలో పోటీ మామూలుగా లేదు. చాలామంది నోటెడ్ హీరోల సినిమాలు లైన్ లో ఉన్నా, 'రాజు వెడ్స్ రాంబాయి' అనే చిన్న సినిమా మాత్రం సర్ప్రైజింగ్ ఓపెనింగ్స్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. పూర్తిగా కొత్త నటీనటులు నటించిన ఈ చిత్రం, తొలి రోజునే సాలిడ్ ఎంట్రీ ఇచ్చి, ఇతర నోటెడ్ హీరోల సినిమాలకు గట్టి పోటీనిచ్చింది.




ఈ చిన్న సినిమా ఓపెనింగ్స్ ఏకంగా 1.47 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇది చిన్న సినిమాల కేటగిరీలో ఆశ్చర్యకరమైన నెంబర్ అని చెప్పాలి. కేవలం కలెక్షన్ మాత్రమే కాదు, సినిమాకి ఒక మంచి స్టార్ట్ ఇచ్చినట్లు అయింది. ఈ సక్సెస్ వెనుక మేకర్స్ ప్రమోషన్ అలాగే తీసుకున్న జాగ్రత్తలు కూడా చాలా హెల్ప్ అయ్యాయని అర్థమవుతోంది.

దర్శకుడు సాయిలు కంపాటి విసిరిన ఓపెన్ ఛాలెంజ్ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. నెగెటివ్ టాక్ వస్తే అమీర్‌పేట్ సెంటర్‌లో అర్ధనగ్నంగా తిరుగుతానని ఆయన చేసిన సంచలన ప్రకటన, సినిమాకి కావాల్సినంత హైప్ క్రియేట్ చేసింది. ఈ బోల్డ్ స్టంట్ ద్వారానే ఈ సినిమాకు మీడియా బజ్ దొరికింది. ఈ విధంగా హైప్ క్రియేట్ చేయడంలో సాయిలు కంపాటి సక్సెస్ అయ్యారు.

అలాగే తక్కువ టికెట్ ధరలు. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లోకెల్లా దీని ధరలు చాలా తక్కువ. సింగిల్ స్క్రీన్లలో కేవలం 99, మల్టీప్లెక్స్‌లలో 105 రూపాయలకే టికెట్ ధరలు ఉండటంతో, ఆడియన్స్ ఇది ఒక వాల్యూ ఫర్ మనీ సినిమాగా భావించారు. ఈ స్మార్ట్ ప్రైసింగ్ వల్ల జనం టికెట్లు కొని థియేటర్లకు రావడానికి పెద్ద సానుకూల అంశంగా మారింది. చిన్న సినిమాకు వాల్యూమ్ ముఖ్యం కాబట్టి, ఈ నిర్ణయం అద్భుతంగా పనిచేసింది.

ఈ సినిమా 2004లో ఖమ్మం వరంగల్ సరిహద్దుల్లో జరిగిన నిజ జీవిత ప్రేమకథ ఆధారంగా తెరకెక్కింది. కథలో ఉన్న ఎమోషనల్ డెప్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. క్లైమాక్స్‌లో వచ్చే షాకింగ్ ట్విస్ట్, ఉప్పెన సినిమా క్లైమాక్స్ మాదిరిగా గుండె గిల్లేలా ఉందని రివ్యూలు చెబుతున్నాయి. కంటెంట్ బలంగా ఉండటంతోనే ఈ ప్రమోషన్స్ వర్కవుట్ అయ్యాయి.

అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు కొత్తవాళ్లైనా తమ పాత్రల్లో సమర్థవంతంగా నటించారు. ముఖ్యంగా చైతు జొన్నలగడ్డ పోషించిన విలన్ పాత్ర పెద్ద హైలైట్. ఈ క్యారెక్టర్ తన విలనిజంతో ఆడియన్స్‌ను బాగా టచ్ చేసింది. లిటిల్ హార్ట్స్ తో హిట్ కొట్టిన ఈటీవీ విన్ సంస్థ భాగస్వామ్యం కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. మొత్తానికి 'రాజు వెడ్స్ రాంబాయి'కి సాలిడ్ స్టార్ట్ అందించింది. ఇప్పుడు ఈ పాజిటివ్ మౌత్ టాక్ తో వీకెండ్ లో ఈ సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.