Begin typing your search above and press return to search.

రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్.. అమీర్ పేటలో ఏం చేశాడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో హీరోయిన్లు అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే

By:  M Prashanth   |   23 Nov 2025 3:29 PM IST
రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్.. అమీర్ పేటలో ఏం చేశాడంటే?
X

టాలీవుడ్ యంగ్ హీరో హీరోయిన్లు అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 21వ తేదీన థియేటర్స్ లో పలు సినిమాలు రిలీజ్ అవ్వగా.. అందులో రాజు వెడ్స్ రాంబాయి మూవీ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.

తెలంగాణలోని ఖమ్మంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాను డైరెక్టర్ సాయిలు తెరకెక్కించి తన మేకింగ్ అండ్ టేకింగ్ తో ఆకట్టుకున్నారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. నిజ జీవిత సంఘటనను తీసుకుని మూవీని బాగా తీశారని అంతా కొనియాడుతున్నారు.

అయితే రీసెంట్ గా డైరెక్టర్ హైదరాబాద్ లోని అమీర్ పేటలో సందడి చేశారు. ఏషియన్ సత్యం మాల్ ఎదురుగా డప్పు వాయించారు. తనకు హిట్ ఇవ్వమంటే రాజు వెడ్స్ రాంబాయి మూవీతో బ్లాక్ బస్టర్ ఇచ్చారని తెలిపారు. అందుకే తనకు అంతకు మించి ఇంకేం కావాలంటూ.. మీరు (ఆడియన్స్) ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు.

ఆ తర్వాత తాను కూడా మాట నిలబెట్టుకుంటున్నా.. చెప్పా కదా అమీర్ పేట్ వస్తా అని.. ఇప్పుడు వచ్చినా.. బ్యాండ్ మీకోసం కొడుతున్నా అన్నా.. అంటూ డప్పు వాయించారు. ఆ సమయంలో ఆయనతోపాటు మరికొందరు యువకులు చిందులు వేశారు. సాయిలు డప్పు కొడుతుండగా.. తీన్ మార్ స్టైప్పులు వేసుకుంటూ సందడి చేశారు.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సినిమా రిలీజ్ కు ముందు ఆయన మూవీని బాగా ప్రమోట్ చేశారని చెప్పాలి. హీరో, హీరోయిన్లతో పాటు డైరెక్టర్ కూడా పలు ప్రమోషన్ ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే.

సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేటలో అర్ధ నగ్నంగా తిరుగుతా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ట్రోల్స్ వచ్చాయి. అలాంటి పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అవసరమా అని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత సక్సెస్ మీట్ లో తన వ్యాఖ్యలపై స్పందించారు సాయిలు. తనకు మాట్లాడటం రాదని, దయచేసి క్షమించండని కోరారు. అమీర్‌ పేటలో బ్యాండ్ కొడతా అన్నారు. చెప్పినట్టు ఇప్పుడు బ్యాండ్ వాయించారు.