ఫ్రీగా 'రాజు వెడ్స్ రాంబాయి' టికెట్స్.. మేకర్స్ సూపర్ ప్లాన్!
చిన్న సినిమాగా విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి మూవీ పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 27 Nov 2025 4:06 PM ISTచిన్న సినిమాగా విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి మూవీ పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. కంప్లీట్ లవ్ స్టోరీతో రూపొందిన ఆ సినిమా.. అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు రాబడుతూ అదరగొడుతుందని చెప్పాలి.
ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. ఆడియన్స్ కు సినిమా మరింత చేరువయ్యేలా మేకర్స్ సూపర్ ప్లాన్ తో సిద్ధమయ్యారు. సినిమాను ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించారు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని థియేటర్స్ లో సినిమాను ఫ్రీగా చూసేలా ఛాన్స్ ఇస్తున్నారు. అయితే ఆ అవకాశం మహిళలకు మాత్రమే ఇవ్వడం విశేషం.
అందుకు సంబంధించిన పూర్తి వివరాలు సోషల్ మీడియాలో వెల్లడించారు మేకర్స్. ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ప్రాంతాల్లో ఎంపిక చేసిన కొన్ని ఫేమస్ థియేటర్లలో సినిమా ఫ్రీగా చూసే అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. థియేటర్స్ వద్దకు వెళ్లి మహిళలు ఉచితంగా టికెట్లు తీసుకోవాలని కోరారు. నవంబర్ 27 వరకు మహిళలకు ఉచిత టికెట్ ఆఫర్ ఉంటుందని తెలిపారు. అయితే టికెట్స్ ఉచితంగా లభించే థియేటర్ల వివరాలు ఇవే!
విశాఖపట్నం- శ్రీ కన్య
విశాఖపట్నం- జగదాంబ
విజయనగరం- కృష్ణ
శ్రీకాకుళం- సూర్య మహల్
రాజమండ్రి- ఊర్వశి కాంప్లెక్స్
కాకినాడ- పద్మ ప్రియ కాంప్లెక్స్
ఏలూరు- అంబికా కాంప్లెక్స్
తణుకు- శ్రీ వెంకటేశ్వర
విజయవాడ- స్వర్ణ కాంప్లెక్స్
మచిలీపట్నం- సిరి కృష్ణ
గుంటూరు- బాలీవుడ్
ఒంగోలు- గోపి
నెల్లూరు- సిరి మల్టీప్లెక్స్
కావలి- లత (రెండు షోలు)
కావలి- మానస (రెండు షోలు)
చిత్తూరు- గురునాథ్
తిరుపతి- జయశ్యామ్
నంద్యాల- నిధి
కర్నూలు- ఆనంద్
కడప- రవి
రాయచోటి- సాయి
అనంతపురం- ఎస్వీ సినీ మ్యాక్స్
హిందూపురం- గురునాథ్
ఇక సినిమా విషయానికొస్తే.. అఖిల్ రాజ్, తేజస్వి ప్రధాన పాత్రల్లో నటించారు. శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి కీలక పాత్రలు పోషించారు. సాయిలు కంభంపాటి దర్శకత్వం వహించారు. డెబ్యూ మూవీతోనే అందరినీ అలరించారు. తన మేకింగ్ తో మెప్పించారు. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్‌లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. వాజిద్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా, నరేష్ అడపా ఎడిటింగ్, ప్రదీప్ జి సౌండ్ డిజైన్, దేవి కృష్ణ కడియాల డాల్బీ అట్మోస్ మిక్సింగ్ బాధ్యతలు చేపట్టారు.
