Begin typing your search above and press return to search.

రాజు గారి గ‌ది ఈసారి కాస్త భారీగానే!

సినిమాను అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆడియ‌న్స్ లో ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఓ ప‌వ‌ర్‌ఫుల్ అమ్మ‌వారి ముందు చీర క‌ట్టుకుని ఉన్న స్త్రీ గాలిలో వేలాడుతూ క‌నిపిస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Oct 2025 11:51 AM IST
రాజు గారి గ‌ది ఈసారి కాస్త భారీగానే!
X

బుల్లితెర యాంక‌ర్ గా కెరీర్ ను మొద‌లుపెట్టి జీనియ‌స్ సినిమాతో డైరెక్ట‌ర్ గా మారారు ఓంకార్. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ ఐదేళ్ల గ్యాప్ త‌ర్వాత రాజు గారి గ‌ది అనే సినిమాను తీసి ఆడియ‌న్స్ ను మెప్పించారు ఓంకార్. రాజు గారి గ‌ది హిట్ అవ‌డంతో దానికి సీక్వెల్స్ చేస్తూ వ‌స్తున్నారు ఓంకార్. ఇప్ప‌టికే రాజు గారి గ‌ది2, రాజు గారి గ‌ది3 తీసిన ఓంకార్, ఇప్పుడు రాజు గారి గ‌ది4 కు శ్రీకారం చుట్టారు.

మునుప‌టి సినిమాల కంటే భారీగా..

సౌత్ ఇండియాలోని ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ రాజు గారి గ‌ది4 సినిమాను మునుప‌టి సినిమాల కంటే భారీగా నిర్మించ‌నుంది. రీసెంట్ గా మిరాయ్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ద‌స‌రా సంద‌ర్భంగా రాజు గారి గ‌ది4: శ్రీచక్రం సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసింది. ఎ డివైన్ హ‌ర్ర‌ర్ బిగిన్స్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రూపొందనుంది.

ఆస‌క్తి క‌లిగిస్తున్న అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్

సినిమాను అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆడియ‌న్స్ లో ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఓ ప‌వ‌ర్‌ఫుల్ అమ్మ‌వారి ముందు చీర క‌ట్టుకుని ఉన్న స్త్రీ గాలిలో వేలాడుతూ క‌నిపిస్తోంది. అనౌన్స్‌మెంట్ పోస్ట‌రే గ‌త భాగాల కంటే భిన్నంగా ఉండ‌టంతో, ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అంద‌రూ ఆస‌క్తిగా ఉన్నారు. ఈ సారి ఓంకార్ హార్రర్, కామెడీల‌ను మ‌రింత మిళితం చేసి ఎవ‌రూ ఊహించ‌ని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ను ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారు.

2026 ద‌స‌రాకు రాజు గారి గ‌ది4

కాళికాపురం అనే గ్రామంలో జ‌రిగే ఈ క‌థ‌, పురాత‌న విశ్వాసాలు, అక్క‌డ ఉన్న భ‌యాల గురించి ప్ర‌స్తావిస్తూ, దీన్ని ఒక హాంటెడ్ క‌థ‌లా మాత్ర‌మే కాకుండా ఒక స్పిరిచ్యువ‌ల్ అడ్వెంచ‌ర్ గా తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నార‌ట‌. రాజు గారి గ‌ది4 సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ గ్లింప్స్ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుండ‌గా, ఈ సినిమాను 2026 ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.