దాదా సౌరవ్ గంగూలీ బయోపిక్ జనం చూస్తారా?
బాలీవుడ్‌లో రొమాంటిక్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన లవ్ రంజన్, ఇప్పుడు తన రూట్ మార్చి భారత క్రికెట్ దిగ్గజం `సౌరవ్ గంగూలీ బయోపిక్` తీయబోతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
By: Sivaji Kontham | 25 Jan 2026 1:00 AM ISTబాలీవుడ్‌లో రొమాంటిక్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన లవ్ రంజన్, ఇప్పుడు తన రూట్ మార్చి భారత క్రికెట్ దిగ్గజం `సౌరవ్ గంగూలీ బయోపిక్` తీయబోతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గంగూలీ బయోపిక్ గురించి గత కొన్ని ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా లవ్ రంజన్ దీనిని అధికారికంగా ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది. గంగూలీ క్రికెట్ కెరీర్‌లోని ఎత్తుపల్లాలు, ఆయన కెప్టెన్సీ స్టైల్, `దాదా`గా అతడు సంపాదించుకున్న క్రేజ్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నారు.
అయితే దాదా పాత్రలో ఎవరు నటిస్తారో చాలా కాలం పాటు క్లారిటీ రాలేదు. రణ్ బీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా లాంటి స్టార్ల పేర్ల వినిపించాయి. కానీ చివరికి రాజ్ కుమార్ రావును ఎంపిక చేసుకుని లవ్ రంజన్ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు దర్శకుడు లవ్ రంజన్ ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ గురించి తాజా అప్‌డేట్‌ను షేర్ చేయడంతో క్రికెట్- సినిమా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
దాదాపు రెండేళ్ల సుదీర్ఘ పరిశోధన తర్వాత స్క్రిప్టు సిద్ధమైంది. సౌరవ్ గంగూలీ జీవితంలోని కీలక ఘట్టాలైన లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పిన సందర్భం నుండి, గ్రెగ్ చాపెల్ వివాదం వరకు, ఇంకా గంగూలీ రొమాంటిక్ సైడ్ ని కూడా కవర్ చేస్తూ స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేసినట్లు లవ్ రంజన్ తెలిపారు. తన బయోపిక్ కోసం గంగూలీ స్వయంగా చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 మధ్యలో షూటింగ్ ప్రారంభించి, 2027 సంక్రాంతి లేదా సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అందరూ ఊహిస్తున్నట్లు రణ్‌బీర్ కపూర్ లేదా ఆయుష్మాన్ ఖురానా కాకుండా ఇప్పుడు రాజ్ కుమార్ రావు టైటిల్ పాత్రలో నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తించింది. దాదా పాత్రను పోషించే నటుడికి క్రికెట్ స్కిల్స్‌తో పాటు కోల్‌కతా కల్చర్‌పై అవగాహన ఉండాలి. దాని కోసం రాజ్ కుమార్ రావు ఇప్పటికే హార్డ్ వర్క్ చేస్తున్నారని సమాచారం.
రాజ్‌కుమార్ రావు ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. దాదా మ్యానరిజమ్స్, అతడు మాట్లాడే తీరు, ఆ బాడీ లాంగ్వేజ్‌ను పండించడానికి రాజ్‌కుమార్ రావు సరైన ఎంపిక అనడంలో సందేహం లేదు. గంగూలీ ఎడమచేతి వాటం బ్యాటర్. రాజ్‌కుమార్ రావు ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా క్రికెట్ కోచింగ్ తీసుకోవడమే కాకుండా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌పై పట్టు సాధించే పనిలో ఉన్నారు.
లవ్ రంజన్ తన సినిమాల్లో యూత్ ఫుల్ ఎనర్జీని, పంచీ డైలాగులతో అలరిస్తాడు. గంగూలీ లాంటి డైనమిక్ పర్సనాలిటీకి లవ్ రంజన్ మేకింగ్ స్టైల్ సరిగ్గా సెట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా ఎంఎస్ ధోని బయోపిక్, మిల్కా సింగ్ బయోపిక్, మేరీకోమ్ బయోపిక్ తరహాలో ఘనవిజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
