ఆ డైరెక్టర్ పారితోషికమే 85 కోట్లా!
బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాణీ ప్రస్తానం గురించి చెప్పాల్సిన పనిలేదు. రైటర్ గా ప్రారంభమై డైరెక్టర్ గా ఎదిగినాయన.
By: Srikanth Kontham | 23 Aug 2025 8:00 PM ISTబాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాణీ ప్రస్తానం గురించి చెప్పాల్సిన పనిలేదు. రైటర్ గా ప్రారంభమై డైరెక్టర్ గా ఎదిగినాయన. రచయితగా ఎన్నో సినిమాలకు పనిచేసారు. అటుపై `మున్నాభాయ్ ఎంబీబీఎస్` తో డైరెక్టర్ గా మారారు. అలాగని రైటర్ గా దూరం కాలేదు. ఇతర సినిమాలకు పని చేస్తూనే డైరెక్టర్ గాను బాలీ వుడ్ లో సత్తా చాటుతున్నారు. డైరెక్టర్ గా ఆయన సినిమాలు చేయడం రేర్ . కానీ చేసారంటే అది సంచల నమే అవుతుం ది. `3 ఇడియట్స్`, ` పీకే`, `లగ్ రహో మున్నాహాయ్`, `సంజు`లాంటి చిత్రాలు ఆయన నుంచి వచ్చినవే.
అందరికీ అదే రూల్:
వందల కోట్ల వసూళ్లతో డైరెక్టర్లలో హిరాణీ ఓ సంచలనంగా ఎదిగారు. రెండు..మూడేళ్లకు ఒక్క సినిమా చేసినా? అది సంచలనంగా ఉంటుంది. మరి ఈ సంచలనం తీసుకునే పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అవును రాజ్ కుమార్ హిరానీ ఒక్కో సినిమాకు 85 కోట్లు పారితోషికం తీసుకుంటారుట. సినిమా ప్రారంభానికి ముందే అడ్వాన్స్ రూపంలో 45 కోట్లు చెల్లించాలిట. అటుపై రిలీజ్ అయ్యే ముందు మొత్తం బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సి ఉంటుందిట. తాను ఏ సినిమా చేసినా ఇదే విధానం పాటిస్తారుట.
నిర్మొహ మాటంగా నో:
పారితోషికం విషయంలో హిరాణీ ఎంత మాత్రం రాజీ పడరట. అంతే నిజాయితీగానూ ఆయన పని ఉంటుందని ఓ బాలీవుడ్ మీడియా కథనం పేర్కొంది. రిలీజ్ అనంతరం సినిమా ఫలితంతో తనకెలాంటి సంబంధం ఉండదని సొంత ప్రొడక్షన్ అయితే తప్ప బయట నిర్మాణ సంస్థలో సినిమా చేస్తే తాను పారి తోషికం తప్ప అదనంగా ఒక్క రూపాయి కూడా తీసుకోరుట. నిర్మాతలు బహుమతుల రూపంలో ఇస్తామన్నా? అలాంటి తాయిలాలేవి వద్దని నిర్మొహమాటంగా చెప్పేస్తారుట. అలాగే సినిమా బడ్జెట్ కూడా అంతే ప్రణాళిక బద్దంగా ఉంటుందిట.
కలం కదల్లేదా:
ప్రారంభానికి ముందు ఎంతైతే బడ్జెట్ కోట్ చేసి పెడతారా? అంత బడ్జెట్ లో నిర్మాణమంతా పూర్తి చే యడం హిరాణీ ప్రత్యేకతగా కథనంలో హైలైట్ అవుతుంది. బడ్జట్ అదనంగా కేటాయిద్దామని నిర్మాత ముందుకొచ్చినా? వద్దని చెప్పేస్తారుట. బాలీవుడ్ లో అరుదైన లక్షణాలు, నిజాయితీగల డైరెక్టర్ గా హిరాణీ ఆ కథనంలో హైలైట్ అవుతున్నారు. దటీజ్ రాజ్ కుమార్. ప్రస్తుతం రాజ్ కుమార్ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. `మున్నా భాయ్ ఎంబీబీఎస్` కథకు సీక్వెల్ సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ప్రథమార్దం కథ కూడా సిద్దమైంది. కానీ ద్వితియార్ధమే కలం కదలడం లేదని ఈ మధ్యనే రివీల్ చేసారు.
