Begin typing your search above and press return to search.

'ద‌స‌రా' త‌ర్వాత కిడ్నాప్ అయ్యే హీరో!

రాజ్ కుమార్ కిడ్నాప్ నేప‌థ్యంలో సినిమా ఉంటుంద‌ని , సినిమా కోసం ప‌స్ట్ క్లాస్ టెక్నీషియ‌న్ల‌ను తీసు కుంటున్న‌ట్లు తెలిపారు. అశోక్, ముని, నాగేష్ ల‌ను ప్ర‌ధాన పాత్ర‌ల‌కు ఎంపిక చేసారు.

By:  Srikanth Kontham   |   12 Sept 2025 12:00 AM IST
ద‌స‌రా త‌ర్వాత కిడ్నాప్ అయ్యే హీరో!
X

క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ ను స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కిడ్నాప్ చేయ‌డం అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఓ పెద్ద స్టార్ కిడ్నాప్ కు గుర‌వ్వ‌డంతో దేశం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ఆ కార‌ణంగా త‌మి ళ‌నాడు ప్ర‌భుత్వం తీవ్ర విమ‌ర్శ‌ల పాలు అయింది. తాజాగా ఈ ఘ‌ట‌న ఆధారంగా ఓ చిత్రానికి రంగం సిద్ద‌మ‌వుతోంది. శ్రీక‌ర ప్ర‌సాద్ ఈ బాధ్య‌త‌లు తీసుకుంటున్నారు. వి.లీలా మ‌నోహార్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టా త్మ‌కంగా నిర్మించ‌డానికి ముందు కొచ్చారు. అక్టోబ‌ర్ లో షూటింగ్ ప్రారంభించ‌డానికి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ ప‌నులు పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డించారు.

108 రోజులు వీర‌ప్ప‌న్ చెర‌లోనే:

రాజ్ కుమార్ కిడ్నాప్ నేప‌థ్యంలో సినిమా ఉంటుంద‌ని , సినిమా కోసం ప‌స్ట్ క్లాస్ టెక్నీషియ‌న్ల‌ను తీసు కుంటున్న‌ట్లు తెలిపారు. అశోక్, ముని, నాగేష్ ల‌ను ప్ర‌ధాన పాత్ర‌ల‌కు ఎంపిక చేసారు. ఈ ఘ‌ట‌న విష యాల్లోకి వెళ్తే స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్, రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసి దాదాపు 108 రోజుల పాటు త‌న‌తోనే ఉంచు కున్నాడు. రాజ్ కుమార్ తో పాటు అల్లుడు గోవింద రాజ్, బంధువు న‌గేష్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నాగ‌ప్ప ను సైతం వీర‌ప్ప‌న్ అప‌హ‌రించాడు. స‌రిగ్గా 25 ఏళ్ల క్రితం జ‌రిగిన ఘ‌ట‌న ఇది.

చ‌ర్చ‌లు జ‌రిపినా విఫ‌లం:

క‌రుణానిధి ప్ర‌భుత్వానికి ఇది ఓ మాయ‌ని మ‌చ్చ‌లా మిగిలిపోయింది. ఆ సమ‌యంలో క‌రుణానిధి అధికా రంలో ఉన్నారు. అప్ప‌టికే 1999లోనే రాజ్ కుమార్ కిడ్నాప్ లిస్ట్ లో ఉన్నాడ‌ని సిట్( వీర‌ప్ప‌న్ కోసం ఏర్పాటు చేసిన బృందం) హెచ్చ‌రించింది. అయినా క‌రుణానిధి ప్ర‌భుత్వం భ‌ద్రతా వైఫ‌ల్యం కార‌ణంగా కిడ్నాప్ జ‌ర‌గ‌డంతో ప్ర‌భుత్వం తీవ్ర విమ‌ర్శ‌ల పాలైంది. దీంతో ప్ర‌భుత్వ‌మే దిగొచ్చి వీర‌ప్ప‌న్ తో చ‌ర్చ‌లు జ‌రిపింది. ప‌లు ద‌ఫాలుగా ఈ చ‌ర్చ‌లు జ‌రిగినా స‌ఫ‌లం కాలేదు.

ఇప్ప‌టీకి మిస్ట‌రీగానే:

దీంతో రాజ్ కుమార్ రావుని వీరప్ప‌న్ ఏం చేస్తాడ‌నే ఆందోళ‌న దేశ వ్యాప్తంగా మొద‌లైంది. అప్ప‌టికే ఆరు నెల‌లు గ‌డిచిపోయింది. అభిమానుల్లో ఆందోళ‌న అంత‌కంత‌కు పెరిగిపోతుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో వీర‌ప్ప‌న్ ఎలాంటి హాని చ‌యేయ‌కుండానే? రాజ్ కుమార్ ని త‌న‌ చెర నుంచి పంపిచేసాడు. దీంతో ఇలా విడుద‌ల చేయ‌డం కూడా ఇప్ప‌టికీ ఓ మిస్ట‌రీగానే మిగిలిపోయింది. అటుపై 2004లో వీర‌ప్ప‌న్ కౌంట‌ర్ లో మృతి చెందాడు. అనంత‌రం 2006 లో రాజ్ కుమార్ క‌న్నుమూసారు.