Begin typing your search above and press return to search.

మాఫియాకు భ‌య‌ప‌డ్డ స్టార్ డైరెక్ట‌ర్ మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా?

ఆయ‌న మ‌రెవ‌రో కాదు రాజీవ్ రాయ్. బాలీవుడ్ లో ఆయ‌నో స్టార్ డైరెక్ట‌ర్. హిందీ ప్రేక్ష‌కుల‌కు, హిందీ సినిమాలు చూసే వారికి ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 Aug 2025 10:52 AM IST
మాఫియాకు భ‌య‌ప‌డ్డ స్టార్ డైరెక్ట‌ర్ మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా?
X

ఎప్పుడేం జ‌రుగుతుందో తెలియ‌దు. అదే జీవితమంటే అని పెద్ద‌లు ఊరికే అన‌లేదు. అప్ప‌టివ‌ర‌కు స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ గా రాణించిన ఓ బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఉన్న‌ట్టుండి సినీ ఇండ‌స్ట్రీని వ‌దిలేసి వెళ్ల‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కేవ‌లం మాఫియా బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే తాను ఇండ‌స్ట్రీని, దేశాన్ని వ‌ద‌లి వెళ్లిపోయాన‌ని ఆ డైరెక్ట‌ర్ చెప్తున్నారు.

యుధ్ తో డైరెక్ట‌ర్ గా డెబ్యూ

ఆయ‌న మ‌రెవ‌రో కాదు రాజీవ్ రాయ్. బాలీవుడ్ లో ఆయ‌నో స్టార్ డైరెక్ట‌ర్. హిందీ ప్రేక్ష‌కుల‌కు, హిందీ సినిమాలు చూసే వారికి ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. యుధ్ అనే మ‌ల్టీస్టారర్ సినిమాతో రాజీవ్ రాయ్ డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మ‌య్యారు. డెబ్యూ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోయినా ఆ త‌ర్వాత నాలుగేళ్ల‌కు 1989లో ముగ్గురు హీరోల‌తో చేసిన త్రిదేవ్ సూప‌ర్ డూప‌ర్ హిట్టైంది.

బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో స్టార్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు

మ‌ధ్య‌లో మ‌ళ్లీ విశ్వాత్మ అనే సినిమా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయినా క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుటైంది. ఇక త‌ర్వాత 1994లో మెహ్రా సినిమాతో ఆయ‌న అందుకున్న విజ‌యం, ఆ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్లు అన్నీ ఇన్నీ కావు. ఆ సినిమా త‌ర్వాత ఆయ‌న మార్కెట్ చాలా పెరిగిపోయింది. ఆ సినిమా స‌క్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో బాబీ డియోల్ తో క‌లిసి గుప్త్ అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ చేసి అంద‌రి చూపునీ త‌న వైపుకు తిప్పుకున్నారు.

పోలీసులు కూడా ఆప‌లేక‌పోయారు

అయితే రాజీవ్ ను, అత‌ని కెరీర్ ను ద‌గ్గ‌ర్నుంచి గ‌మ‌నించిన ముంబై మాఫియా గుప్త్ సినిమా త‌ర్వాత అత‌న్ని ఫోన్ కాల్స్ తో బెదిరించ‌డం, సినిమా ఆఫీస్ పై దాడులు చేయించ‌డం లాంటివి చేయించింది. పోలీసులు రాజీవ్ కు ఎంత సెక్యూరిటీ ఇచ్చినా ఆ దాడుల్ని ఎవ‌రూ ఆప‌లేకపోయారు. ఈ సంఘ‌ట‌న‌ల‌న్నీ రాజీవ్ కు ప్ర‌శాంత‌త, మ‌న‌శ్శాంతి లేకుండా చేశాయి. అందుకే ఆ టైమ్ లో అత‌న్నుంచి వ‌చ్చి ప్యార్ ఇష్క్ మొహ‌బ్బ‌త్, అసంభవ్ సినిమాల‌తో రాజీవ్ ఘోర‌మైన ఫ్లాప్ ను అందుకున్నారు. ఆ సినిమాల ఫ‌లితాల‌తో ఢీలా ప‌డిపోవ‌డంతో పాటూ మాఫియా బెదిరింపుల వ‌ల్ల ఇండ‌స్ట్రీ తో పాటూ ఏకంగా దేశాన్నే వ‌దిలి కుటుంబంతో స‌హా విదేశాల‌కు వెళ్లిపోయారు.

రీసెంట్ గా ఇండియాకు తిరిగొచ్చిన అత‌న్ని ఇన్నేళ్లు ఎందుకు ఇండ‌స్ట్రీకి, ఇండియాకు దూర‌మ‌య్యార‌ని అడిగితే మాఫియా వ‌ల్ల త‌న‌కు క‌లిగిన భ‌య‌మే దానికి కార‌ణమ‌ని, టీ సిరీస్ గుల్ష‌న్ ను చంప‌డం చూశాక త‌న‌కు మ‌రో ఆలోచ‌నే రాలేద‌ని అన్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన రాజీవ్ రాయ్ ప్ర‌స్తుతం రెండు సినిమాల‌ను తీస్తున్నారు. ఇన్నేళ్ల త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్టుకున్న ఆయ‌న తిరిగి పూర్వ వైభ‌వాన్ని అందుకోగ‌ల‌రా లేదా అన్న‌ది చూడాలి.