Begin typing your search above and press return to search.

ఈ టాలెంట్ కూడా ఉందా గురూ.. దెబ్బకు సినీ లోకం ఫిదా!

అలాంటి రాజీవ్ కనకాల మొదటిసారి తనలోని సింగింగ్ టాలెంట్ ను కూడా బయటకు తీశాడు. లవ్ ఓటీపీ అనే సినిమాకి సంబంధించి ఒక ర్యాప్ సాంగ్ పాడాడు.

By:  Madhu Reddy   |   12 Nov 2025 10:00 PM IST
ఈ టాలెంట్ కూడా ఉందా గురూ.. దెబ్బకు సినీ లోకం ఫిదా!
X

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ నటులలో రాజీవ్ కనకాల ఒకరు. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల చాలామంది నటులను తీర్చిదిద్దారు. ఇకపోతే తెలుగు సినిమాల్లో రాజీవ్ కనకాల ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాల్లో కనిపించేవారు. పైగా ఎన్టీఆర్ కి , రాజీవ్ కనకాలకి మధ్య మంచి బాండింగ్ ఉంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలో కూడా రాజమౌళికి జక్కన్న అనే పేరును పెట్టింది కూడా రాజీవే..

కేవలం నటుడిగా మాత్రమే రాజీవ్ మంచి గుర్తింపు సాధించుకున్నారు. అయితే రాజీవ్ లోని మరో టాలెంట్ ని కూడా బయటికి తీసే ప్రయత్నం చేశారు. ఇకపోతే రాజీవ్ ఎన్ని పాత్రలు చేసినా కూడా రీసెంట్ టైమ్స్ లో లిటిల్ హార్ట్స్ అనే సినిమాలో చేసిన గోపాలరావు అనే పాత్ర విపరీతమైన పేరును తీసుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు చాలామంది రాజీవ్ ను గోపాలరావు అంకుల్ అని పిలవడం మొదలుపెట్టారు. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా సుమ ఇదే పేరును పదే పదే ప్రస్తావించింది.

రాజీవ్ లో మరో టాలెంట్

అలాంటి రాజీవ్ కనకాల మొదటిసారి తనలోని సింగింగ్ టాలెంట్ ను కూడా బయటకు తీశాడు. లవ్ ఓటీపీ అనే సినిమాకి సంబంధించి ఒక ర్యాప్ సాంగ్ పాడాడు. అయితే ఆ ర్యాప్ సాంగ్ ప్రస్తుతం ట్విట్టర్లో అవైలబుల్ గా ఉన్నాయి. రాజీవ్ చేసిన ఆ కొత్త ప్రయత్నానికి చాలామంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.

పాట పాడిన తర్వాత రాజీవ్ స్టూడియోలో మాట్లాడుతూ.." నేను ఎప్పుడూ పాడలేదు ఇలా మొదటిసారి పాడుతున్నాను మా డైరెక్టర్ దయవలన, మీ దయవలన ఈ ప్రయత్నం చేశాను ఏమవుతుందో చూడాలి" అని అంటున్నాడు. ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుంది అని మ్యూజిక్ డైరెక్టర్ మరోవైపు చెబుతున్నారు.

విజువల్స్ కూడా

కేవలం ఆ ర్యాప్ సాంగ్ పాడించిన వీడియో మాత్రమే కాకుండా ఆ తర్వాత దానిని సినిమాలో ఎలా చూపించబోతున్నారో అని వీడియో కూడా కొంత మేరకు కట్ చేసి దానిలో ఇన్వాల్వ్ చేశారు.

లవ్ ఓటిపి అంటే ఓవర్ టార్చర్ ప్రెజర్. ఈ సినిమాకి అనీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజీవ్ కనకాల ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలో విడుదల కానున్నాయి.

మొత్తానికి రాజీవ్ కనకాల కేవలం నటుడిగానే కాకుండా సింగర్ గా కూడా తన కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు. అయితే ఆ ఉత్సాహం చూస్తుంటే ఈ పాటలు పాడటం అనేది ఇంకా ముందు రోజుల్లో కూడా చేస్తాడేమో అనిపిస్తుంది. కంప్లీట్ సాంగ్ వచ్చిన తర్వాత ఆడియన్స్ ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారో తెలుస్తుంది.