Begin typing your search above and press return to search.

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

పా రంజిత్ డైరెక్షన్ లో వచ్చిన 'కబాలి', 'కాలా' రెండు మూవీస్ లో రజనీకాంత్ ను సరికొత్తగా ప్రజెంట్ చేశాయి.

By:  Gopi Velupala   |   2 Nov 2026 5:00 PM IST
రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...
X

సౌత్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా రికార్డులను సృష్టిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్, ఈ మధ్య కాలంలో డిఫరెంట్ మేకింగ్ ఉన్న యంగ్ డైరెక్టర్లతో పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు..అయితే ఈ తరం ప్రతిభావంతులైన దర్శకులలో కొందరు రజినీకాంత్ కి మాస్ సక్సెస్ ను అందించడంలో పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోయారంటు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

పా రంజిత్

పా రంజిత్ డైరెక్షన్ లో వచ్చిన 'కబాలి', 'కాలా' రెండు మూవీస్ లో రజనీకాంత్ ను సరికొత్తగా ప్రజెంట్ చేశాయి. కానీ రజినీకాంత్ మూవీ లో ఉండే మాస్ ఎలివేషన్స్ ఈ సినిమాల్లో కరువయ్యాయి. ఈ రెండు సినిమాల్లో స్క్రీన్ ప్లే స్లోగా ఉండటం తో సాధారణ ప్రేక్షకుడు పెట్టుకున్న కమర్షియల్ అంచనాలను అందుకోలేకపోయాయి...

కార్తీక్ సుబ్బరాజు

'జిగర్తండ' మూవీతో డిఫరెంట్ ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు... రజినీకాంత్ ను హీరోగా పెట్టి చేసిన 'పేట' మూవీ ఓకే అనిపించినప్పటికి అది రజినీకాంత్ స్టాండర్డ్ మూవీ కాదనే పేరు వచ్చింది. ఫైనల్ గా కార్తీక్ సుబ్బరాజు సైతం రజినీకాంత్ కి కమర్షియల్ సక్సెస్ ను అందించలేకపోయాడు. టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న కార్తీక్ సుబ్బరాజు రజినీకాంత్ స్వాగ్ ను పర్ఫెక్ట్ గా చూపించినప్పటికి కథ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే మూవీ సూపర్ హిట్ అయ్యేది.

లోకేష్ కనకరాజు

'విక్రమ్' మూవీతో కమల్ హాసన్ కి బిగ్గెస్ట్ హిట్ ను అందించిన లోకేష్ కనకరాజ్ రజినీకాంత్ విషయంలో మాత్రం తడబడ్డాడు. 'కూలీ' సినిమాతో రజినీకాంత్ ను నెక్స్ట్ లెవల్లో చూపిస్తాడని భావించిన అతని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. కథ విషయంలో క్లారిటి లేకపోవడంతో డిఫరెంట్ మేకింగ్ ఉన్నప్పటికి అది సగటు ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేయలేకపోయింది.

రజినీ ఇమేజ్ ను పెర్ఫెక్ట్ గా ఆవిష్కరించిన నెల్సన్...

యంగ్ డైరెక్టర్లలో రజినీకాంత్ మాస్ మేజిక్ ను పెర్ఫెక్ట్ గా రీ క్రియేట్ చేసిన ఘనత 'నెల్సన్ దిలీప్ కుమార్' కే దక్కుతుంది... గత మూడేళ్ల క్రితం 'జైలర్' మూవీ తో సక్సెస్ ను సాధించిన నెల్సన్ ఇప్పుడు 'జైలర్ 2' తో భారీ విజయాన్ని అందించాడు. రజినీకాంత్ తో భారీ యాక్షన్ సన్నివేశాలు చేయించకుండా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఆటిట్యూడ్ తో థియేటర్లలో విజిల్స్ వేయించారు. మేకింగ్ లో సత్తా చాటి సినిమాను సూపర్ హిట్ గా నిలిపాడు.