రజనీ సలహాతో అంతా మారిపోయింది: సన్‌రైజర్స్ మారన్
ఈ సింపుల్ ఫార్ములాని సన్ గ్రూప్ అధినేతలకు చెప్పినందుకు ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా మంది నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు
By: Sivaji Kontham | 12 Aug 2025 4:00 AM ISTఅత్యుత్తమంగా ఆడే గుర్రంపైనే రేసింగ్ లో పందెం కాయాలి. ఈ సింపుల్ ఫార్ములాని సన్ గ్రూప్ అధినేతలకు చెప్పినందుకు ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా మంది నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. పబ్లిక్ వేదికలపై రజనీ సర్ సలహా ఏ రేంజులో వర్కవుటైందో ఇప్పుడు సన్ రైజర్స్ ఐపిఎల్ టీమ్ యజమాని అయిన కావ్యామారన్ తండ్రి కళానిధి మారన్ `కూలీ` ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు.
దూకుడున్న ఆటగాళ్లను కొనాలని రజనీకాంత్ సలహా ఇచ్చారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కోసం ఉత్తమ ఆటగాళ్లను కొనాలనే ఆలోచన ఆయన కారణంగా పుట్టుకొచ్చినదే. ఈ టీమ్ టోర్నమెంట్ లో బెస్ట్ స్కోర్ లు సాధించింది. అత్యధిక స్కోర్ తో పాటు, అత్యంత వేగంగా స్కోర్ సాధించిన రికార్డు కూడా ఈ టీమ్ కే ఉంది. ఇదంతా రజనీకాంత్ చలువేనని మారన్ ఆకాశానికెత్తేశారు. ఐపీఎల్ లో అత్యంత ఎంటర్ టైనింగ్ టీమ్ ని కొనుగోలు చేసినందుకు విజయాలు తమ ఖాతాలో చేరాయని వారంతా ఆనందం వ్యక్తం చేసారు. రజనీ సర్ రికార్డుల్లానే మా టీమ్ కూడా రికార్డులు బ్రేక్ చేస్తోందని అన్నారు.
నిజానికి జైలర్ సినిమా విడుదల సమయంలో సన్ రైజర్స్ సహయజమాని అయిన కావ్య మారన్ ఎంతో ఒత్తిడిలో కనిపించారు. జట్టు ఓటమిని చూసి తట్టుకోలేని స్థితిలో ఉండేవారు. కానీ రజనీ సలహా తర్వాత ది బెస్ట్ ప్లేయర్స్ ని కొనుగోలు చేసారు కావ్యమారన్- కళానిధి మారన్. ఆ తర్వాత పరిస్థితులు మారాయనడానికి కూలీ వేదికపై ఆయన కామెంట్లే కారణం. సన్ గ్రూప్ లో సన్ పిక్చర్స్ భారతీయ ఎంటర్ టైన్ మెంట్ లో దిగ్గజ సంస్థ అన్న సంగతి తెలిసిందే. క్రీడా వ్యాపారంలోను ఇప్పుడు కళ్లు భైర్లు కమ్మే ఆదాయాల్ని అందిపుచ్చుకుంటున్నారు మారన్ అండ్ కో.
