ఒక్కడే రజనీ.. ఒక్కడే విజయ్..!
కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకి పర్ఫెక్ట్ పోటీ ఇచ్చిన మరో స్టార్ ఉన్నాడు అంటే ఆయన దళపతి విజయ్ ఒక్కడే అని చెప్పొచ్చు.
By: Ramesh Boddu | 23 Nov 2025 6:00 PM ISTకోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకి పర్ఫెక్ట్ పోటీ ఇచ్చిన మరో స్టార్ ఉన్నాడు అంటే ఆయన దళపతి విజయ్ ఒక్కడే అని చెప్పొచ్చు. కమల్ హాసన్ ఎంత గొప్ప మహానటుడు అయినా ఆయన్ను నటనలో టాప్ అంటారు కానీ బాక్సాఫీస్ కలెక్షన్స్ లెక్కకు వస్తే మాత్రం అది సూపర్ స్టార్ రజనీ తర్వాతే ఎవరైనా అనేస్తారు. ఐతే రజనీ ఉన్నప్పుడే విజయ్ తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చాడు. దళపతి విజయ్ గా తమిళ నాట తిరుగు లేని స్టార్ డం సొంతం చేసుకున్నాడు.
రజనీని కూడా వెనక్కి నెట్టేసే రేంజ్ కి దళపతి విజయ్ క్రేజ్..
రజనీ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ దగ్గర నుంచి రజనీ ని కూడా వెనక్కి నెట్టేసే రేంజ్ కి దళపతి విజయ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే రజనీకాంత్ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తున్నారు. ఈమధ్యనే కూలీ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఐతే దళపతి విషయానికి వచ్చే సరికి ఆయన పాలిటిక్స్ కోసం సినిమాలను వదిలి పెడుతున్నారు. విజయ్ చివరి సినిమాగా జన నాయగన్ వస్తుంది. ఈ సినిమాను వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు.
విజయ్ చివరి సినిమా కాబట్టి ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ పై సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. సినిమాలో విజయ్ పొలిటికల్ కెరీర్ కి మైలేజ్ ఇచ్చే సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఐతే రజనీకి ఇన్నాళ్లు పోటీగా నిలిచి ఒక టైంలో రజనీని కూడా దాటేసిన విజయ్ ఇప్పుడు సడెన్ గా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు.
దళపతి విజయ్ సినిమాలను ఆపేయడం ఫ్యాన్స్ ని..
సో ఇప్పుడు మళ్లీ కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీ ఒక్కడి మీదే బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించే పని పడింది. అఫ్కోర్స్ మిగతా హీరోలు కమన్ల్ హాసన్, అజిత్, సూర్య, శివ కార్తికేయన్ వీళ్లంతా ఉన్నారు. కానీ రజనీకి ఈక్వల్ గా కొనసాగుతూ వచ్చింది విజయ్ ఒక్కడే. అందుకే ఒక్కడే దళపతి అతను కూడా సినిమాలను ఆపేయడం ఫ్యాన్స్ ని నిరాశపరుస్తున్నా.. రీల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లో హీరోగా చేయాలని దళపతి ఈ నిర్ణయం తీసుకున్నారు.
విజయ్ సినిమాలను ఆపేస్తే ఆ ఇంపాక్ట్ కోలీవుడ్ బాక్సాఫీస్ పై తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సినిమాతో కమర్షియల్ సక్సెస్ ఇస్తూ 200 కోట్లు తగ్గకుండా కలెక్షన్స్ రాబట్టే దళపతి విజయ్ పూర్తిగా సినిమాలు మానేస్తే ఆ మార్కెట్ ఫుల్ ఫిల్ చేసే అవకాశం ఉండదు. అందుకే దళపతి తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రజనీకే మళ్లీ కోలీవుడ్ టాప్ చెయిర్ దక్కిందనే అనుకోవచ్చు. ఐతే రజనీ కూడా మహా అయితే మరో ఐదారేళ్లు సినిమాలు చేసి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని చూస్తున్నారు. సో ఆ తర్వాత తమిళ పరిశ్రమ కొత్త కథానాయకుడిని ఎంపిక చేసుకోవాల్సిందే.
