శనివారం డైరెక్టర్ ని సూపర్ స్టార్ హోల్డ్ లో!
సూపర్ స్టార్ రజనీకాంత్ కు యంగ్ డైరెక్టర్ `సరిపోదా శనివారం` ఫేం వివేక్ ఆత్రేయ ఆ మధ్య ఓస్టోరీ చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
By: bunnyanil761@gmail.com | 18 Jun 2025 3:00 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ కు యంగ్ డైరెక్టర్ `సరిపోదా శనివారం` ఫేం వివేక్ ఆత్రేయ ఆ మధ్య ఓస్టోరీ చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. స్టోరీ నచ్చడంతో రజనీకాంత్ కూడా పాజిటివ్ గా స్పందించారని... వివేక్ తదుపరి సినిమా ఇదే అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఫైనల్ వెర్షన్ విని పించాల్సి ఉందని...అవసరం మేర మార్పులు కూడా రజనీ సూచించినట్లు వార్తలొచ్చాయి.
ఇదంతా జరిగి కొన్ని నెలల గడుస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ఏంటంటే? మరో మూడేళ్ల తర్వాత ఈ సినిమా చేద్దామని రజనీకాంత్ అన్నారుట. ప్రస్తుతం తన షెడ్యూల్ బిజీగా ఉందని..మూడేళ్ల వరకూ కొత్త సినిమాలేవి చేయ లేనని అంతవరకూ వెయిట్ చేయాల్సిందిగా అడిగారని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
దీంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందనే కొత్త ప్రచారం మొదలైంది. మూడేళ్ల తర్వాత అంటే అప్పుడు సమీకరణాలు ఎలా ఉంటాయో చెప్పలేం. గతంలో టాలీవుడ్ డైరెక్టర్ శంకర్ విషయంలో కూడా కమల్ హాసన్ ఇలాగే చేసారు. శంకర్ నేరెట్ చేసిన అద్భుతంగా ఉందని...కలిసి సినిమా చేద్దామని ప్రామిస్ కూడా చేసారు. ఆ తర్వాత కొంత అప్ డేట్ కూడా తెరపైకి వచ్చింది. అయితే కాలం గడిచే కొద్ది ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని అర్దమైంది.
వివేక్ ప్రాజెక్ట్ విషయంలోనూ రజనీ అలా కాలం వెళ్లదీస్తారా? మాటకు కట్టుబడి చేస్తారా? అన్నది చూడాలి. ప్రస్తుతం రజనీకాంత్ `జైలర్ 2` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. `కూలీ` పూర్తయిన వెంటనే జైలర్ కి షిప్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ అనంతరం `ఖాకీ` ఫేం హెచ్ . వినోథ్ తో ఓ సినిమా చేయనున్నారు.