500 కోట్ల వసూళ్లలో ఎటు చూసినా వాళ్లిద్దరే!
మరి కోలీవుడ్ నుంచి ఎంత మంది స్టార్లు ఈ రేసులో ఉన్నారంటే? ఎటూ చూసినా ఇద్దరే కనిపిస్తున్నారు.
By: Srikanth Kontham | 31 Aug 2025 12:00 AM ISTటాలీవుడ్...బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు 500 కోట్లు అన్నది చాలా చిన్న మాట. స్టార్ హీరోలంతా చాలా కాలం క్రితమే 500 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. టాలీవుడ్ పరంగా చూస్తే రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ లున్నారు. ఇంకా కొంత మంది యంగ్ హీరోలు లాంటి వారు ఆ మార్క్ కు అతి చేరువలో ఉన్నారు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖనా, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ ఇలా కొంత మంది స్టార్లను చెప్పుకొవచ్చు. ఇప్పుడా ఆ హీరోలకు 500 కోట్ల వసూళ్లు అన్నది చాలా చిన్నది. 1000 కోట్ల క్లబ్ లోనూ కొంత మంది హీరోలున్నారు.
మరి కోలీవుడ్ నుంచి ఎంత మంది స్టార్లు ఈ రేసులో ఉన్నారంటే? ఎటూ చూసినా ఇద్దరే కనిపిస్తున్నారు. వారే సూపర్ స్టార్ రజనీకాంత్ , దళపతి విజయ్. రజనీకాంత్ `2.0` సినిమాతో 500కోట్ల క్లబ్ లో చేరారు. అటుపై `జైలర్` విజయంతో 700 కోట్లకు పైగా సాధించారు. తాజాగా రిలీజ్ అయిన `కూలీ`తోనూ 500కోట్ల క్లబ్ లో చేరారు. అయితే రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో కూడుకున్నవే. 1000 కోట్ల వసూళ్లకు ఆస్కారం ఉన్న చిత్రాలు. కానీ కంటెంట్ వైఫల్యం కారణంగా ఆ రేంజ్ సక్సెస్ ను అందుకోలేదు. ఇలయ దళపతి విజయ్ కూడా `లియో`తో ఆ మార్క్ ను సెట్ చేసారు.
బిగ్ స్టార్స్ అంతా డీలా:
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా? ఆ రేంజ్ ని టచ్ చేయలేదన్నది విశ్లేషకుల మాట. మణిరత్నం దర్శకత్వం వహించిన `పొన్నియన్ సెల్వన్` మొదటి భాగం కూడా 500 కోట్ల వసూళ్లను సాధించిందే. కానీ ఆ సినిమా క్రెడిట్ ఏ ఒక్క హీరోకి సొంతం కాదు. చాలా మంది స్టార్లు భాగమైన సినిమా కావడంతో ఒక్క హీరోకే పరమితం కాదు. తమిళ చిత్ర పరిశ్రమకు సం బంధించి ఇద్దరు స్టార్లే 500కోట్లకు పరిమితమవ్వడం అన్నది నిరుత్సాహ పరిచే విషయమే.
ఎన్నాళ్లీ సేఫ్ గేమ్:
కమల్ హాసన్, అజిత్, విక్రమ్, సూర్య, కార్తీ, ధనుష్ లాంటి స్టార్లు అగ్రతారలున్నా? వాళ్లు ఇంకా 500 కోట్ల క్లబ్ లో చేరలేదు. విశాల్, శివకార్తికేయన్, విజయ్ సేతుపతి లాంటి టైర్ 2 హీరోలున్నా? ఆ మార్క్ కి ఇంకా చాలా దూరంలో ఉన్నారు. కొత్త కొత్త ప్రయోగాలతోనైనా క్లబ్ లో చేరాలని ప్రయత్నిస్తున్నా? సరైన ఫలితాలు రావడం లేదు. టాలీవుడ్ తరహాలో అక్కడ హీరోలు సక్సెస్ అవ్వడం లేదు. వైఫల్యాలు ఎదుర వ్వడంతో రిస్క్ ఎందుకని సేఫ్ జోన్ లోనే సినిమాలు చేస్తున్నారు. మరి ఈ సేఫ్ ఎంతకాలం ఆడుతారో చూడాలి.
