రజనీ లెగసీని నడిపించే వారసులు?
అయితే రజనీకాంత్ కుటుంబంలో మూడోతరం ఆయన లెగసీని ముందుకు నడిపించే వీలుంది. సౌందర్య రజనీకాంత్, ఐశ్వర్య రజనీకాంత్ పిల్లలు వేగంగా పెరిగి పెద్దవాళ్లవుతున్నారు.
By: Sivaji Kontham | 29 Nov 2025 6:42 AM ISTమెగాస్టార్ చిరంజీవి లెగసీని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకు నడిపిస్తున్నారు. అమితాబ్ లెగసీని అభిషేక్ నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ ఇద్దరికీ సమకాలికుడు అయిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లెగసీని నడిపించే వారసుడు ఎవరు? అంటే.. దానికి సరైన జవాబు లేదు. ఆయన కుమార్తెలు ఇద్దరూ దర్శకత్వంలో అడుగుపెట్టారు.. సినిమాలు నిర్మించారు కానీ నటనలో లేరు. అయితే రజనీకాంత్ కుటుంబంలో మూడోతరం ఆయన లెగసీని ముందుకు నడిపించే వీలుంది. సౌందర్య రజనీకాంత్, ఐశ్వర్య రజనీకాంత్ పిల్లలు వేగంగా పెరిగి పెద్దవాళ్లవుతున్నారు. వారిలో ఎవరో ఒకరు కచ్ఛితంగా రజనీ లెగసీని ముందుకు నడిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజాగా ఇఫీలో ఒక అరుదైన దృశ్యం గోచరించింది. రజనీకాంత్, ఆయన వారసురాళ్లు, మనవళ్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు. రజనీకాంత్ వంశం అంతా కలిసి కనిపించడం చాలా అరుదు.. కానీ ఆ మూవ్ మెంట్ రానే వచ్చింది. లెజెండ్ రజనీకాంత్ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు మొత్తం కుటుంబం కూడా గోవా వెళ్లారు.
రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఇన్‌స్టా లో ఒక రేర్ క్లిక్ ని షేర్ చేసారు. అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. వైరల్ అయిన ఈ ఫోటోలో తలైవర్ రజనీకాంత్ ఎప్పటిలాగే సాధారణ క్యాజువల్ లుక్‌లో కనిపించగా, తన భార్య లతా రజనీకాంత్‌తో కలిసి పోజులిచ్చారు. రజనీ కుమార్తెలు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ ఇదే ఫ్రేమ్ లో కనిపించారు. రజనీకాంత్ మనవళ్ళు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉన్నారు. మొత్తం మూడు తరాలు ఈ ఫోటోలు కనిపించడం ఆసక్తికరం. సౌందర్య `టుగెదర్ ఎట్ @iffigoa` అనే క్యాప్షన్ ఇచ్చారు ఈ ఫోటోకి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, , రజనీకాంత్ తదుపరి జైలర్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా జూన్ 2026లో విడుదల కానుంది.
