తలైవా స్టైల్, స్వాగ్.. వాల్యూ రూ.180 కోట్లు?
రజనీకాంత్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు.. అభిమానులకు పండగే. ఆయన చేసే చిన్న చిన్న థింగ్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తాయి.
By: M Prashanth | 21 Oct 2026 11:47 AM ISTరజనీకాంత్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు.. అభిమానులకు పండగే. ఆయన చేసే చిన్న చిన్న థింగ్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తాయి. వాకింగ్ స్టైల్, మాట్లాడే విధానం, కళ్లతో ఎక్స్ప్రెషన్స్.. ఇలా ప్రతి విషయంలో కూడా తలైవా మార్క్ కనిపిస్తుంది. భారీ ఫైట్లు, కష్టమైన డ్యాన్సులు లేకుండానే తనదైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు ఇదే స్టైల్ అండ్ స్వాగ్ కు రూ.180 కోట్ల వాల్యూ ఉంటుందా అనే చర్చ మొదలైంది.
రీసెంట్ గా రిలీజైన జైలర్-2 కోసం ఆయనకు రెమ్యూనరేషన్, లాభాల్లో షేర్ కలిపి ఆ రేంజ్ లోనే అందవచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే రజనీకి ఇంత భారీ మొత్తం ఇవ్వడం వెనుక ఆయనకున్న క్రేజ్ మాత్రమే కాదు.. నిర్మాతలకు ఆయన తెచ్చిపెట్టే బిజినెస్ కూడా మెయిన్ రీజన్. ఒక సినిమా కోసం హీరో ఎంత కష్టపడ్డారనే దానితో పాటు, ఆ సినిమా ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుందనేది కూడా రెమ్యూనరేషన్ ను డిసైడ్ చేస్తుంది.
ఆ విషయంలో రజనీ ప్లేస్ ఎప్పుడూ స్పెషలే. ఆయన సినిమా వస్తుందంటే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళలోనూ సందడి కనిపిస్తుంది. ఓవర్సీస్ లో కూడా ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. 2023లో వచ్చిన జైలర్ దీనికి మంచి ఎగ్జాంపుల్. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా రాబట్టింది.
రజనీ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన స్టైల్ కు ఇతర క్యాస్టింగ్ రోల్స్ కూడా తోడవడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ విజయమే రెండో భాగంపై అంచనాలు పెరగడానికి మెయిన్ రీజన్. మొదటి భాగం ఇచ్చిన నమ్మకంతోనే సీక్వెల్ కోసం నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారనే చర్చ సాగుతోంది. జైలర్-2 కోసం రజనీకి రూ.110 కోట్ల వరకు పారితోషికం అందవచ్చని, సినిమా లాభాల్లో షేర్ కలిపితే మొత్తం రూ.180 కోట్లకు చేరవచ్చట.
అయితే ఆ లెక్కలపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అందుకే దాన్ని ఇప్పటికే ఫిక్స్ అయిన రెమ్యూనరేషన్ గా చూడలేం. సినిమా వసూళ్లను బట్టి లాభాల్లో వాటా ఉంటేనే మొత్తం మారే అవకాశం ఉంటుంది. ఇక జైలర్-2లో రజినీతోపాటు అనేక మంది స్టార్ నటీనటులు ఉండగా.. వారి రెమ్యూనరేషన్లపై కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఎంత మంది ఉన్నా.. రజినీ రోల్ కు ఉండే ప్రత్యేకత వేరు.
ఆయన స్క్రీన్ పై ఎంతసేపు కనిపించినా, ఆ సీన్స్ ను గుర్తుండిపోయేలా చేయగలగడం ఆయన టాలెంట్. అందుకే ఆయన సినిమాల్లో స్టైల్, స్వాగ్ కు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. నిర్మాతలు కూడా ఆ అట్రాక్షన్ ను నమ్ముకుని భారీ మొత్తాలు పెట్టడానికి సిద్ధమవుతుంటారు. అందుకే తలవై విషయంలో రూ.180 కోట్ల డిబేట్ కు కారణం ఆయన చేసే ఫైట్లు, డ్యాన్సులు కాదు.. స్క్రీన్ పై ఆయన కనిపిస్తే చాలు అనే రేంజ్ లో ఉన్న స్టార్ డమ్. అదే రజనీకాంత్ అసలైన స్త్రెంత్.
