Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ రజినీకాంత్ సరికొత్త నిర్ణయం.. కూతురు భావోద్వేగం!

పూర్తి వివరాలలోకి వెళ్తే..సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కొచ్చడయాన్.

By:  Madhu Reddy   |   18 Feb 2026 2:08 PM IST
సూపర్ స్టార్ రజినీకాంత్ సరికొత్త నిర్ణయం.. కూతురు భావోద్వేగం!
X

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 70 సంవత్సరాలు వయసులో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ.. యంగ్ స్టార్ హీరోలను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోల పని అయిపోయింది.. ఇక రిటైర్డ్ తీసుకునే సమయం వచ్చేసింది అని ఎగతాళి చేసిన వారందరికీ కూడా తన విజయాలతో నోళ్లు మూయిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు భారీ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. మధ్యలో సరైన హిట్స్ లేక కాస్త తడబడ్డారు.

అదే సమయంలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' సినిమా చేసి సంచలనం సృష్టించిన సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పుడు జైలర్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలా 70 సంవత్సరాల వయసులో కూడా వరుస బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ రికార్డులు సృష్టిస్తున్న రజనీకాంత్.. మరొకవైపు గతంలో తన కెరియర్లో ఫ్లాప్ గా నిలిచిన చిత్రాలను ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి యానిమేషన్ రూపంలో రూపొందిస్తూ లాభాల బాట పట్టడమే కాకుండా ఈ చిత్రాల ద్వారా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

అందులో భాగంగానే 2014లో విడుదలైన ఒక చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకొని రజనీకాంత్ ను నిరాశపరిచింది. పైగా ఆయన కూతురు సౌందర్య రజినీకాంత్ కూడా దర్శకురాలిగా చేసిన మొదటి సినిమా కూడా అదే కావడం గమనార్హం అయితే అలాంటి సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నా.. ఆ చిత్రం మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయితే అలాంటి ఈ సినిమాను మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఏఐ ను ఉపయోగించి రీ ఎడిట్ చేశారు. ఈ మేరకు టీజర్ ను విడుదల చేయగా.. ఇది బాగా వైరల్ అవుతోంది.

పూర్తి వివరాలలోకి వెళ్తే..సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కొచ్చడయాన్. రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన తొలి పీరియాడికల్ యానిమేషన్ మూవీని సునంద మురళి మనోహర్, సునీల్, ప్రశీదా చౌదరి నిర్మించగా.. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. పైగా 2014లో ఈ సినిమాను తెలుగులో విక్రమసింహగా రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇలాంటి సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

అందులో భాగంగానే కొచ్చడయాన్ సినిమాను ఏఐతో కొత్త వెర్షన్ రెడీ చేశారు. ఈ రీ మాస్టర్డ్ కొచ్చడయాన్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం టీజర్ ను మంగళవారం రోజు రిలీజ్ చేశారు. ఇక దీనిపై దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ తన పోస్ట్ ద్వారా.." పదేళ్ల క్రితం మోషన్ క్యాప్చర్ ఫిలింగా దీనిని చేసాము. ఈ సినిమా నన్ను ఛాలెంజ్ చేసింది. నన్ను పూర్తిగా మార్చేసింది . కొచ్చడయాన్ రీ మాస్టర్డ్ టీజర్ ని రిలీజ్ చేయడం భాగోద్వేగానికి గురిచేస్తోంది "అంటూ తెలిపింది. అంతేకాదు స్టార్లతో తీసిన భారత తొలి ఫోటో రియల్ ఎస్టేట్ మూవీ ఇదేనని మేకర్స్ స్పష్టం చేశారు. ఇకపోతే టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ రీ రిలీజ్ ఎప్పుడు చేస్తారు అన్నది ఇంకా స్పష్టం చేయలేదు.

మొత్తానికైతే వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న రజినీకాంత్ ఇప్పుడు తన ఫ్లాప్ సినిమాలను ఇలా అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి యానిమేషన్ రూపంలో రిలీజ్ చేస్తూ మరో రికార్డు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి రీ రిలీజ్ లో ఈ ఫ్లాప్ మూవీ ఎలాంటి రికార్డ్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.