సూపర్ స్టార్ లో రియల్ భాషాని అప్పుడే తట్టిలేపాడా!
గ్యాగ్ స్టర్ నేపథ్యంతో తెరకెక్కిన `భాషా` అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో చెప్పాల్సిన పనిలేదు. అందులో సూపర్ స్టార్ క్యారెక్టరైజేషన్...డైలాగులు సినిమాను నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్తాయి.
By: Srikanth Kontham | 18 Sept 2025 8:00 AM ISTగ్యాగ్ స్టర్ నేపథ్యంతో తెరకెక్కిన `భాషా` అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో చెప్పాల్సిన పనిలేదు. అందులో సూపర్ స్టార్ క్యారెక్టరైజేషన్...డైలాగులు సినిమాను నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్తాయి. సంఘవిద్రోహ శక్తులకు వ్యతిరేకంగా పని చేయడం...అన్యాయాన్ని ఎదురించడం భాషా ప్రత్యేకత. ఆ రెండు పాయింట్ల మీదనే కథ నడుస్తుంది. రెండు విభిన్న పాత్రల్లో సూపర్ స్టార్ రజనీ పెర్పార్మెన్స్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకించి మాణిక్ భాషా పాత్రని సూపర్ స్టార్ పీక్స్ తీసుకెళ్లారు.
హీరోగా ఎదుగుతోన్న రోజుల్లో:
మళ్లీ భాషా లాంటి సినిమా రావాలంటే? అది రజనీకి మాత్రమే సాధ్యమవుతుంది. అలా రజనీ సినిమాలో భాషాని చూసాం. మరి అదే సూపర్ స్టార్ లో రియల్ భాషాని ఎంత మంది చూసారు? అంటే ఓ నిర్మాత చూసినట్లు తెలుస్తోంది. అప్పటికీ రజనీకాంత్ `బాషా` రేంజ్ స్టార్ కాదు. కానీ తనలో రియల్ భాషా ఉన్నాడని అతడికి మాత్రమే తెలుసు. ఓసారి ఆ సంఘటనలోకి వెళ్తే. సూపర్ స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతోన్న రోజుల్లోనే ఓ సినిమా ఆఫర్ వచ్చింది.
చేయకపోతే పో అన్నారా?
అప్పటికింకా ఆర్దికంగా నిలదొక్కుకోలేదు. ఈ క్రమంలో ఓ సినిమాలో అవకాశం వస్తే తొలి రోజు షూటింగ్ కు నిర్మాత పంపిన కారులో స్పాట్ కు వెళ్లారు. అప్పుడే దర్శకుడు రజనీకాంత్ కి అడ్వాన్స్ ఇవ్వాల్సిందిగా నిర్మాతను కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ నిర్మాత ఆయనేమైనా సూపర్ స్టారా? షూటింగ్ చేయమని అరిచాడుట. ఆ తర్వాత డబ్బులిద్దాం అన్నాడుట. అది చూసిన రజనీకాంత్ కోపం తన్నుకొచ్చింది. అయినా కోపాన్ని అదుపు చేసుకుని సున్నితంగా సార్ ఈ సినిమా చేయను అన్నారుట రజనీకాంత్.దీంతో నిర్మాత `చేయకపోతే పో` అన్నారుట.
రజనీ కళ్లలో నిప్పులు వర్షం:
అప్పుడు రజనీకాంత్ తనని ఎలా తీసుకొచ్చారో? అలాగే అదే కారులో తీసుకొచ్చిన చోటే దించేయండని అన్నారుట. ఆ సమయంలో రజనీకాంత్ నిర్మాత కళ్లలోకి ఎర్రగా చూస్తూనే సమాధానం చెప్పారుట. పళ్లు బిగబెట్టి కళ్లలో నిప్పుల వర్షమే కురిపించారుట. దీంతో ఆ నిర్మాత వెనక్కి తగ్గడంతో రజనీ కూల్ అయ్యారుట. ఆ తర్వాత కారు లేకుండానే అక్కడ నుంచి రజనీకాంత్ వెళ్లిపోయారుట. అప్పుడే రజనీకాంత్ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో ఎదగాలని డిసైడ్ అయ్యారుట. అనుకున్నట్లే ఎదిగి చూపించారు. ఎదగడం అంటే ఇదని ఎంతో మంది స్పూర్తిగా నిలిచారు. ఇటీవలే రజనీకాంత్ నటించిన కూలీ భారీ అంచనాల మధ్‌య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
