Begin typing your search above and press return to search.

విజ‌య్ విజ‌యంతో ఆశ్చ‌ర్య‌పోయిన ర‌జనీకాంత్!

విజయ్ 52 ఏళ్ల వయసులోనే రాజకీయ పరంగా ఎమ్‌జీఆర్, ఎన్టీఆర్ ల కంటే ఎంతో గొప్ప విజయాన్ని గుర్తింపును సాధించారని ర‌జ‌నీ అభిప్రాయ‌ప‌డ్డారు.

By:  Srikanth Kontham   |   17 May 2026 2:36 PM IST
విజ‌య్ విజ‌యంతో ఆశ్చ‌ర్య‌పోయిన ర‌జనీకాంత్!
X

ద‌ళ‌ప‌తి విజ‌య్ తొలిసారి త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఏకంగా ముఖ్య‌మంత్రి కావ‌డం దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. విజ‌య్ సైతం ఊహించ‌ని విజ‌యం ఇది. అన్నీ నియోజ‌క వ‌ర్గాల్లో తానే అభ్య‌ర్దిగా ఉన్నాను? అనే న‌మ్మ‌కాన్ని ప్రేక్ష‌కుల్లో క‌లిగించి ద‌క్కించుకున్న విజ‌యం ఇది. విజ‌య్ విజ‌యం ప‌ట్ల కోలీవుడ్ నటులంతా హ‌ర్షం వ్య‌క్తంచేసారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య్ కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం జ‌రిగింది. ఇందులో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా ఉన్నారు. అయితే విజ‌య్ గెల‌వ‌డం ర‌జ‌నీకాంత్ కు ఇష్టం లేద‌న్న‌ట్లు మీడియాలో కొంత ప్ర‌చారం జ‌రిగింది.

తాజాగా ఈ అంశాల‌న్నింటిని ఉద్దేశించి ర‌జనీకాంత్ మీడియా ముఖంగా స్పందించారు. విజయ్ 52 ఏళ్ల వయసులోనే రాజకీయ పరంగా ఎమ్‌జీఆర్, ఎన్టీఆర్ ల కంటే ఎంతో గొప్ప విజయాన్ని గుర్తింపును సాధించారని ర‌జ‌నీ అభిప్రాయ‌ప‌డ్డారు. తొలుత విజ‌య్ గెలిచాడు అన‌గానే ఆశ్చ‌ర్య‌పోయానన్నారు. మ‌రోవైపు ఆనందం కూడా క‌లిగింద‌న్నారు. సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పాత తరం నేతలతో పోల్చడం సహజమే అయినా? విజయ్ సాధించిన ఈ స్థాయి విజయం కేవలం సినిమా క్రేజ్ వల్ల మాత్రమే రాలేదని ఆయన ఎంచుకున్న వ్యూహాలు ,ఎదిరించిన శక్తుల వల్లే సాధ్యమైందన్నారు.

రాజకీయ ప్రస్థానంలో విజయ్ ఎదుర్కొన్న సవాళ్లు సామాన్యమైనవి కావు. కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన బీజేపీ పార్టీని, అలాగే తమిళనాడు స్థానిక రాజకీయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన రెండు ప్రధాన ద్రావిడ పార్టీలను ఏకకాలంలో ఎదుర్కొని విజయ్ విజయం సాధించారని ర‌జ‌నీ కొనియాడారు. తోటి సినీ ఇండస్ట్రీ వ్యక్తిగా ఎలాంటి అసూయ లేకుండా విజయ్ సాధిం చిన ఈ విజ‌యం చూసి గర్వపడుతున్నట్లు తెలిపారు. సినిమా స్టార్డమ్‌ను పక్కన పెట్టి ప్రజా క్షేత్రంలోకి వచ్చి నిలబడాలనే విజయ్ సంకల్పం ఆదర్శనీయమని అభినందించారు.

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ఆశాకిరణంగా మారిన దళపతి విజయ్‌పై ప్రజల్లో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఎమ్‌జీఆర్, ఎన్టీఆర్ వంటి మహామహులు ప్రజలకు అందించిన సంక్షేమ పాలనను నేటి డిజిటల్ యుగంలో విజయ్ ఎలా ముందుకు తీసుకెళ్తారనే క్యూరియాసిటీ నెల‌కొంది. ఎమ్‌జీఆర్, ఎన్టీఆర్ వంటి యుగ పురుషులతో 52 ఏళ్ల విజయ్‌ను పోల్చడం అనేది సాహసమే. మ‌రి భవిష్యత్తులో విజయ్ తన మేనిఫెస్టోతో, పాలనా విధానాలతో ప్రజల హృదయాలను ఎలా గెలుచుకుంటారో? క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు? తీసుకొస్తారో? చూడాలి.